Crude Prices Rising: రష్యా చమురు దిగుమతులపై యూరోపియన్ కౌన్సిల్ ఆంక్షలు.. మండిపోతున్న క్రూడ్ ఆయిల్ ధరలు..

Crude Prices Rising: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతిపై ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ తీసుకున్న నిర్ణయం తర్వాత బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ భారీగా పెరిగాయి.

Crude Prices Rising: రష్యా చమురు దిగుమతులపై యూరోపియన్ కౌన్సిల్ ఆంక్షలు.. మండిపోతున్న క్రూడ్ ఆయిల్ ధరలు..
Crude oil
Follow us

|

Updated on: May 31, 2022 | 11:15 AM

Crude Prices Rising: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతిపై ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ తీసుకున్న నిర్ణయం తర్వాత బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు మంగళవారం ఉదయం 123 డాలర్లు దాటింది. ఉదయం 10.05 గంటలకు.. జూలై బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్ 3.15 శాతం పెరిగి 123.20 డాలర్లకు చేరుకుంది. WTIలో జూలై క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ 1.15 శాతం పెరిగి 118.53 డాలర్ల వద్ద ఉన్నాయి. జూన్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఉదయం ప్రారంభ గంటలో రూ.9,080 నుంచి పెరిగి రూ.9,210 వద్ద ట్రేడవుతోంది. ఇది 1.43 శాతం పెరుగుదల. జూలై ఫ్యూచర్స్ మునుపటి ముగింపు రూ.8,896 నుంచి 1.39 శాతం పెరిగి రూ.9,200 వద్ద ట్రేడవుతున్నాయి.

యూరోపియన్ కౌన్సిల్ తమ సమావేశంలో రష్యాపై ఆంక్షల ఆరవ ప్యాకేజీని అంగీకరించినట్లు ఈయూ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్ ఒక ట్వీట్ లో వెల్లడించారు. ఈ నిర్ణయంతో రష్యా నుంచి చమురు దిగుమతులపై నిషేధం ప్రారంభం కానుంది. రష్యా నుంచి చమురు దిగుమతుల్లో 75 శాతంపై ఆంక్షలు తక్షణమే ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. 2022 చివరి నాటికి.. యూరప్‌లోకి దిగుమతి చేసుకునే రష్యా చమురులో 90 శాతం నిషేధించబడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్యల కారణంగా రష్యా యుద్ధానికి అవసరమైన ఆర్థిక వనరులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. యుద్ధం ముగించేందుకు ఇది అత్యధిక స్థాయిలో రష్యాపై ఒత్తిడిని పెంచుతుందని కౌన్సిల్ అభిప్రాయపడింది. పైప్‌లైన్ ద్వారా పంపిణీ అవుతున్న ముడి చమురుకు తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సరఫరాలో ఆకస్మిక అంతరాయాలు ఏర్పడితే, సరఫరా భద్రతను నిర్ధారణకు అత్యవసర చర్యలు ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. రష్యాపై EU డిపెండెన్సీని దశలవారీగా తొలగించడానికి ముమ్మర చర్యలు చేపడుతోంది. మరో పక్క చైనాలో లాక్ డౌన్ క్రమంగా సడలిస్తున్నందున గ్లోబల్ మార్కెట్లో ముడి చమురుకు డిమాండ్ పెరుగుతోంది. చైనా ప్రపంచంలో ప్రధాన వినియోగదారులుగా ఉండటంతో ధరలపై ప్రభావం పడుతోందని తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.