Twitter New Feature: ట్విట్టర్ నుంచి కొత్త ఫీచర్ రాబోతుంది.. అందుబాటులోకి వస్తే మామూలుగా ఉండదు..
ట్విట్టర్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. Twitter ఈ ఫీచర్ పేరు సర్కిల్‌గా నిర్ణయించారు. ట్విట్టర్ సర్కిల్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మీ ట్వీట్‌ను ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో మీరే నిర్ణయించుకోవచ్చు...
ట్విట్టర్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. Twitter ఈ ఫీచర్ పేరు సర్కిల్‌గా నిర్ణయించారు. ట్విట్టర్ సర్కిల్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మీ ట్వీట్‌ను ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో మీరే నిర్ణయించుకోవచ్చు. ఇది ఇన్‌స్టాగ్రామ్ క్లోజ్ ఫ్రెండ్ ఫీచర్‌ను పోలి ఉంటుంది. ట్విట్టర్ ఈ ఫీచర్‌ను iOS, Android వినియోగదారులకు అందుబాటులో తీసుకురావాలని భావిస్తుంది. సర్కిల్ ఫీచర్ వచ్చిన తర్వాత గరిష్ఠంగా 150 మందిని జోడించవచ్చు. మీరు మీ నిర్దిష్ట ట్వీట్లలో కొన్నింటికి స్నేహితులే చూసే విధంగా సెట్‌చేసుకోవచ్చు. సర్కిల్ ఫీచర్ క్రమంగా వినియోగదారులందరికీ విడుదల అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే సర్కిల్‌లో ఉన్న వ్యక్తులు మాత్రమే ట్వీట్‌కు ప్రత్యుత్తరం ఇవ్వగలరు. లైక్ లేదా రీ-ట్వీట్ చేయగలరు.
ముందుగా మీ Twitter ఖాతాకు లాగిన్ చేయండి. ఇప్పుడు ప్రొఫైల్ విభాగానికి వెళ్లి కంపోజ్ ట్వీట్ ఎంపికపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఆడియన్స్ బటన్‌ను చూస్తారు, దానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు కొత్త సర్కిల్ ఎంపికను పొందుతారు. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు సర్కిల్‌ను సెట్ చేసుకోవచ్చు. వ్యక్తులను యాడ్ చేయవచ్చు.