AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

June New Rules: వాహన ఇన్సురెన్స్‌ నుంచి బ్యాంకు హోమ్‌ లోన్‌ వరకు బాదుడే.. బాదుడు.. జూన్‌ 1 నుంచి కొత్త నిబంధనలు

June Rules Change: జూన్ 1 నుండి కొన్ని మార్పులు, కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. ఇవి మీ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

June New Rules: వాహన ఇన్సురెన్స్‌ నుంచి బ్యాంకు హోమ్‌ లోన్‌ వరకు బాదుడే.. బాదుడు.. జూన్‌ 1 నుంచి కొత్త నిబంధనలు
Subhash Goud
|

Updated on: May 31, 2022 | 5:07 PM

Share

New Rules From 1st June: జూన్ 1 నుండి కొన్ని మార్పులు, కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. ఇవి మీ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (India Post Payments Bank) కస్టమర్ల కోసం జూన్ నుండి అమలులోకి వచ్చే కొన్ని నియమాలు ఉన్నాయి. మీ ఫైనాన్స్‌పై ప్రభావం చూపే అకాశం ఉంది. బ్యాంక్ కస్టమర్లు కాకుండా, వివిధ వర్గాల వాహనాలకు థర్డ్-పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరగడం వల్ల వాహన యజమానుల నెలవారీ బడ్జెట్‌పై నేరుగా ప్రభావం చూపుతుంది.

SBI కస్టమర్లు అధిక గృహ రుణ వడ్డీ రేట్లు చెల్లించాలి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన హోమ్ లోన్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (EBLR)ని 40 బేసిస్ పాయింట్లు పెంచి 7.05 శాతానికి చేర్చింది. గతంలో ఈబీఎల్‌ఆర్‌ రేటు 6.65 శాతంగా ఉంది. ఇల్లు, వాహన రుణాలతో సహా ఏదైనా రకమైన లోన్‌ను అందిస్తున్నప్పుడు బ్యాంకులు EBLRపై క్రెడిట్ రిస్క్ ప్రీమియం (CRP)ని కూడా జోడిస్తాయి. SBI వెబ్‌సైట్ ప్రకారం.. పెరిగిన వడ్డీ రేట్లు జూన్ 1, 2022 నుండి అమలులోకి వస్తాయి. అన్ని ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్‌లకు వడ్డీ రేట్లు EBLRకి లింక్ చేయబడతాయి.

ఇవి కూడా చదవండి

యాక్సిస్ బ్యాంక్ సర్వీస్ ఛార్జీ పెంపు

యాక్సిస్ బ్యాంక్ జీతం, సేవింగ్స్ ఖాతాదారులకు సర్వీస్ ఛార్జీలను కూడా పెంచింది. సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) రూ.15,000 నుండి రూ.25,000కి పెంచింది. అయితే బ్యాలెన్స్ నిర్వహించనప్పుడు ఎలాంటి కనీస సేవా రుసుము ఉండదు.

ద్విచక్ర వాహనాల బీమా ప్రీమియం

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన విధంగా వివిధ వర్గాల వాహనాలకు థర్డ్-పార్టీ మోటార్ బీమా ప్రీమియం పెరుగుతుందని గమనించడం ముఖ్యం. 75సీసీ కంటే తక్కువ ఇంజన్ కెపాసిటీ ఉన్న ద్విచక్ర వాహనాలను కలిగి ఉన్నవారు థర్డ్ పార్టీ కవర్ ధర రూ.538కి చేరుకుంది. 75సీసీ కంటే ఎక్కువ ఇంజన్ కెపాసిటీ ఉన్న టూవీలర్స్ అయితే 150సీసీకి మించని ద్విచక్ర వాహనాలకు ప్రీమియం ధర ఉంటుంది. రూ.714. ఇంజన్ కెపాసిటీ 150సీసీ దాటినా, 350సీసీకి మించని ద్విచక్ర వాహనాలకు ప్రీమియం ధర రూ.1366 చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక 350సీసీ కంటే ఎక్కువ ఇంజన్ కెపాసిటీ ఉన్న ద్విచక్ర వాహనాలకు ప్రీమియం ధర రూ.2,804.

ఫోర్ వీలర్ వాహనాలకు  బీమా మరింత ప్రీయం

ప్రైవేట్ ఫోర్-వీలర్ల థర్డ్ పార్టీ రేట్లు కూడా పెరిగాయి. జూన్ 1 నుండి 1000cc కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన కారుకు థర్డ్-పార్టీ ప్రీమియం రూ. 2,094. ఇంజన్ కెపాసిటీ 1000 నుంచి 1500సీసీకి మించని కారుకు థర్డ్-పార్టీ ప్రీమియం రూ.3,416 అవుతుంది. అలాగే 1500cc కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన కార్ల కోసం ప్రీమియం రూ.7,897గా ఉంటుంది. ఈ రేట్లు చివరిసారిగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి సవరించబడ్డాయి. COVID-19 మహమ్మారి సమయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. తాజాగా ఈ మార్పులు చేశారు.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఛార్జీలు

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ సర్వీస్ ఛార్జీలను (AePS) ప్రవేశపెట్టింది. అంటే AePS జారీచేసేవారి లావాదేవీ ఛార్జీలు జూన్ 15, 2022 నుండి అమలులోకి వస్తాయి. అయితే నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్, మినీ స్టేట్‌మెంట్ వంటి ప్రతి నెలా మొదటి మూడు AePS జారీచేసే లావాదేవీలు ఉచితంగా ఉంటాయి. మీరు ఉచిత లావాదేవీల పరిమితిని దాటితే, AePS జారీచేసేవారి నగదు ఉపసంహరణలు, నగదు డిపాజిట్‌లకు ప్రతి లావాదేవీకి రూ.20తో పాటు జీఎస్‌టీ విధించబడుతుంది. మినీ స్టేట్‌మెంట్ లావాదేవీలకు ప్రతి లావాదేవీకి రూ.5తో పాటు జీఎస్‌టీ విధించబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి