- Telugu News Photo Gallery Bank Holidays June 2022: Banks To Remain Shut For 11 Days In Upcoming Month | Full List Here
Bank Holidays June 2022: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. జూన్ నెలలో బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజు అంటే..!
Bank Holidays June 2022: జూన్ నెల ప్రారంభమైంది. ప్రతినెల బ్యాంకులకు ఏయే తేదీల్లో సెలవులు ఉంటాయో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. వాటి ఆధారంగా బ్యాంకుల లావాదేవీలు జరపడం, ఇతర పనుల కోసం ప్లాన్ ..
Updated on: Jun 01, 2022 | 6:15 AM

Bank Holidays June 2022: జూన్ నెల ప్రారంభమైంది. ప్రతినెల బ్యాంకులకు ఏయే తేదీల్లో సెలవులు ఉంటాయో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. వాటి ఆధారంగా బ్యాంకుల లావాదేవీలు జరపడం, ఇతర పనుల కోసం ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

జూన్‌లో దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 11 రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ బ్యాంక్ సెలవుల్లో(Bank Holidays) వారాంతపు సెలవులు 6 ఉన్నాయి. ప్రాంతీయ పండుగల సందర్భంగా రెండు రోజుల సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) వెబ్‌సైట్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. జూన్ ప్రారంభమైన వెంటనే బ్యాంకులు 2వ తేదీన మూసి ఉంటాయి. అందువల్ల ముందస్తుగా అప్రమత్తమై పనులు చేసుకోవడం ఉత్తమం. దేశంలోని అన్ని బ్యాంకుల పాలసీలు, సెలవులు రెండింటినీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది.

జూన్ 2022లో ఆదివారం కారణంగా జూన్ 5, 12, 19, 26 తేదీల్లో దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయనున్నారు. జూన్ 11, 25 తేదీలలో దేశంలోని అన్ని బ్యాంకులు నెలలో రెండవ, నాల్గవ శనివారాల కారణంగా మూసివేయన్నారు. ఇది కాకుండా, మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా జూన్ 2 న సిమ్లాలో బ్యాంకులు పనిచేయవు.

అలాగే YMA డే, గురు హరగోవింద్ జయంతి, రాజా సంక్రాంతి సందర్భంగా జూన్ 15 న మిజోరం, భువనేశ్వర్, జమ్మూ, కాశ్మీర్‌లోని బ్యాంకులు పనిచేయవు. అయితే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, లక్నో, పాట్నా, రాంచీ, చండీగఢ్, జైపూర్, రాయ్‌పూర్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, త్రిపురలలో బ్యాంకులు 6 రోజులు మాత్రమే మూతపడనున్నాయి.

జూన్, 2022లో బ్యాంక్ సెలవులు ఈ విధంగా ఉన్నాయి: జూన్ 2న- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, మహారాణా ప్రతాప్ జయంతి- తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లలో బ్యాంకులు పనిచేయవు. జూన్ 3న శ్రీ గురు అర్జున్‌దేవ్ జీ అమరవీరుల దినోత్సవం (పంజాబ్), జూన్ 5న ఆదివారం, జూన్ 11న 2వ శనివారం, జూన్ 12న ఆదివారం, జూన్ 14న గురు కబీర్ జయంతి- ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, హర్యానా, పంజాబ్‌లలో బ్యాంకులు పనిచేయవు.

జూన్ 15న వైఎంఏ డే- గురు హరగోవింద్ జీ జయంతి- ఒడిశా, మిజోరం, జమ్ముకశ్మీర్‌లలో బ్యాంకులకు సెలవు. జూన్ 19న ఆదివారం, జూన్ 22న ఖర్చీ పూజ (త్రిపుర), జూన్ 25న 4వ శనివారం, జూన్ 26న ఆదివారం బ్యాంకులు మూసి ఉంటాయి. బ్యాంకుల సెలవులను బట్టి మీరు పనులను చేసుకునేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.




