AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

French Open 2022: సెరెనా విలియమ్స్ రికార్డుకు 2 అడుగుల దూరం.. 9 ఏళ్ల చరిత్ర చెరిపేసేందుకు సిద్ధమైన ఇగా స్విటెక్..

గత నెలలో తొలిసారిగా ఒక సెట్‌ను కోల్పోయిన ప్రపంచ నంబర్ వన్ ఇగా 6-7, 6-0, 6-2తో చైనాకు చెందిన జెంగ్ క్వివెన్‌ను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్‌కు చేరుకుంది.

Venkata Chari
|

Updated on: Jun 01, 2022 | 6:05 AM

Share
ప్రస్తుతం ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్‌ జరుగుతుండగా, ఈ టెన్నిస్‌ టోర్నీపై పలువురు దిగ్గజ ఆటగాళ్లు కన్నేశారు. వారిలో ఇంగా స్వ్యాంటెక్ ఒకరు. ఇంగా గత కొన్ని టోర్నమెంట్‌ల నుంచి బలమైన ఆటతో ఆకట్టుకుంటోంది. ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ అద్భుత ఆటతీరుతో టాప్-8లో చోటు సంపాదించుకుంది.

1 / 4
గత నెలలో తొలిసారిగా ఒక సెట్‌ను కోల్పోయిన ప్రపంచ నంబర్ వన్ ఇగా 6-7, 6-0, 6-2తో చైనాకు చెందిన జెంగ్ క్వివెన్‌ను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్‌కు చేరుకుంది. ఈమె వరుసగా 32వ విజయాన్ని దక్కించుకుంది.

2 / 4
గత ఐదు టోర్నీల్లో విజేతగా నిలిచిన స్వియాటెక్ ఫిబ్రవరి నుంచి ఓడిపోలేదు. 2013లో WTAలో సెరెనా విలియమ్స్ 34 మ్యాచ్‌ల విజయాల పరంపర తర్వాత ఇదే అతిపెద్ద విజయాల పరంపరగా నిలిచింది. ఆమె ఇప్పుడు 11వ సీడ్ జెస్సికా పెగులాతో తలపడనుంది. ఆమె రొమేనియాకు చెందిన ఇరినా కామెలియా బెగును 4-6, 6-2, 6-3 తేడాతో ఓడించింది.

3 / 4
మహిళల సింగిల్స్‌లో, డారీనా కసత్కినా ప్రీ-క్వార్టర్‌ఫైనల్స్‌లో కెమిలా జార్జియాను 6-2, 6-2తో ఓడించడం ద్వారా ఈ గ్రాండ్‌స్లామ్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనను సమం చేసింది.

4 / 4