PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ.. ఇలా చెక్ చేసుకోండి..

Narendra Modi : ఇప్పటివరకు పది విడతల వారిగా నగదు జమ చేసిన కేంద్రం (PM Kisan).. ఇప్పుడు 11వ విడత నగదును విడుదల చేశారు.

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ.. ఇలా చెక్ చేసుకోండి..
Pm Kisan
Rajitha Chanti

|

May 31, 2022 | 1:29 PM

Narendra Modi : పీఎం నరేంద్రమోదీ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా రైతులకు శుభవార్త అందించింది. అన్నదాతలు ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 11 విడత నగదును ఈరోజు (మే 31న) ప్రధాన మంత్రి మోదీ విడుదల చేశారు. పీఎం కిసాన్ పథకం కింద దేశంలోని అర్హులైన రైతుల ఖాతాల్లోకి ప్రతి విడతలో రూ. 2000 నగదును జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పది విడతల వారిగా నగదు జమ చేసిన కేంద్రం (PM Kisan).. ఇప్పుడు 11వ విడత నగదును విడుదల చేశారు. సిమ్లాలో జరిగిన మెగా ర్యాలీలో 10 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు పీఎం నరేంద్రమోదీ రూ. 21,000 కోట్లకు పైగా డబ్బులను విడుదల చేశారు. పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 2 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అయితే పీఎం కిసాన్ నగదు మీ ఖాతాల్లోకి జమ అయ్యాయా ? లేదా ? అనేవి తెలుసుకోవాలంటే ముందుగా పీఎం కిసాన్ అధికారిక ఖాతాకు లాగిన్ కావాల్సి ఉంటుంది.

పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ ఆన్ లైన్‏లో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి..

ఈరోజు ప్రధాని నరేంద్రమోదీ పీఎం కిసాన్ 11వ విడత నగదును విడుదల చేశారు. అర్హులైన రైతులు తమ పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉన్నాయో లేదా తెలుసుకోండి.

* ముందుగా పీఎం కిసాన్ వెబ్ సైట్ కి లాగిన్ కావాలి.

* తర్వాత హోమ్ పేజీ నుంచి ఫార్మర్ కార్నర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

* అ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అక్కడ పీఎం కిసాన్ కింద లబ్ధిదారుల జాబితా అనే పేజీపై క్లిక్ చేయాలి.

* డ్రాప్ డౌన్ జాబితా లో మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోవాలి.

* ఆ తర్వాత అవసరమైన మొత్తం సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు లబ్దిదారుల జాబితాను చూడగలరు..

అన్ని వివరాలను పూర్తిచేసిన తర్వాత మీకు అర్హత ఉన్నప్పటికీ లబ్దిదారుల జాబితాలో మీ పేరు లేకపోతే మీరు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు.

పీఎం కిసాన్ పథకం క్రెడిట్ వివరాలు ఎలా తనిఖీ చేయాలి.

* ముందుగా పీఎం కిసాన్ వెబ్ సైట్ లాగిన్ కావాలి.

* తర్వాత హోమ్ పేజీ నుంచి ఫార్మర్స్ కార్నర్ అనే పేజీని చూడాలి.

* ఫార్మర్స్ కార్నర్ సెక్షన్‌లో ‘బెనిఫిషియరీ స్టేటస్’ అనే ట్యాబ్ పై క్లిక్ చేయాలి.

* అలా కాకుండా నేరుగా https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx లింక్‌కి కూడా వెళ్లవచ్చు

* ఆ తర్వాతి పేజీలో మీ ఆధార్ నంబర్, పీఎం కిసాన్ ఖాతా నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.

ఇవి కూడా చదవండి

* వివరాలను ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటాపై క్లిక్ చేయాలి. తర్వాత మీకు లబ్ధిదారుల క్రెడిట్ స్థితి కనిపిస్తుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu