Nithiin: యంగ్ హీరో కోసం రంగంలోకి యూనివర్సల్ స్టార్.. నితిన్ సినిమా కోసం కమల్ హాసన్ అలా..

మాచార్ల నియోజకవర్గం సినిమాలోని మొదటి పాటను ఈరోజు కమల్ హాసన్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు నితిన్..

Nithiin: యంగ్ హీరో కోసం రంగంలోకి యూనివర్సల్ స్టార్.. నితిన్ సినిమా కోసం కమల్ హాసన్ అలా..
Nithiin
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: May 31, 2022 | 7:34 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ (Nithiin) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవల మ్యాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆశించినంత స్థాయిలో ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు నితిన్ ఆశలన్ని ప్రస్తుతం నటిస్తోన్న మాచర్ల నియోజకవర్గం సినిమా మీదనే ఉన్నాయి. డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా కోసం యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ రంగంలోకి దింపుతున్నాడు ఈ యంగ్ హీరో..

మాచార్ల నియోజకవర్గం సినిమాలోని మొదటి పాటను ఈరోజు కమల్ హాసన్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు నితిన్.. కమల్ నటించిన విక్రమ్ సినిమా తెలుగు రైట్స్.. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విక్రమ్ సినిమా ప్రమోషన్లలో నితిన్ సైతం పాల్గోంటూ.. అలాగే తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే విక్రమ్ ప్రీ రిలీజ్ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోనే కమల్ హాసన్ నితిన్ నటిస్తోన్న మాచర్ల నియోజకవర్గం మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మాచర్ల నియోజకవర్గం నుంచి నితిన్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో నితిన్ మరింత స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇందులో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రేసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే