AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajendra Prasad: నా సినీ జీవితంలో నచ్చిందే చెప్పాను.. అందుకే ముఖం చూపించను అన్నాను.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్..

తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా.. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మించిన

Rajendra Prasad: నా సినీ జీవితంలో నచ్చిందే చెప్పాను.. అందుకే ముఖం చూపించను అన్నాను.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్..
Rajendra Prasad
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 31, 2022 | 7:34 PM

Share

బాక్సాఫీస్ వద్ద ఎఫ్ 3 (F3) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా మే 27న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా.. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాలో సోనాల్ చౌహల్ కీలకపాత్రలో నటించి మెప్పించగా.. సునీల్, రాజేంద్రప్రసాద్, ప్రగతి, అన్నపూర్ణ ముఖ్యపాత్రలలో నటించారు. తాజాగా ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ వేడుక‌ను హైద‌రాబాద్ ద‌స్‌ప‌ల్లా హోట‌ల్‌ లో సోమ‌వారం నాడు చిత్ర యూనిట్ నిర్వ‌హించింది. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “నా 45 ఏళ్ళ సినీ జీవితంలో నాకు న‌చ్చిందే చెప్పాను. ఎఫ్‌3 సినిమా చూశాక ఈ సినిమా హిట్ కాక‌పోతే మొహం చూపించ‌న‌ని అన్నాను. అందుకే నేను మాస్క్ వేసుకుని ఇలా వ‌చ్చాను. ఇప్పుడు నిజ‌మైన స‌క్సెస్ ప్రేక్ష‌కులు ఇచ్చారు. ఈ సినిమాను త్రిబుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చారు. సోమ‌వారంనాడు కూడా గుంటూరుతో అన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ సినిమాను రెండు న‌మ్ముకుని తీశాం. ఒక‌టి న‌వ్వు. రెండు ప్రేక్ష‌కులు న‌మ్ముకుని తీశాం. 45 ఏళ్ళుగా నేను న‌వ్వునే న‌మ్ముకుని సినిమాలు చేస్తున్నాను. అలా ఎఫ్‌2,ఎఫ్‌3 చేశాను. ప్ర‌పంచంలోని న‌లుమూల‌ల‌నుంచి నాకు ఫోన్లు వ‌స్తున్నాయి. మ‌ళ్ళీ మీ రోజులు గుర్తుకువ‌చ్చాయి అంటూ నాతో అంటున్నారు. నాకు మాత్రం `మాయ‌లోడు` సినిమా గుర్తుకు వ‌చ్చింది. మ‌న‌కు పండుగ రోజుల్లో పాత సినిమాలు టీవీల్లో వేస్తుంటారు. గుండ‌మ్మ‌క‌థ‌, అప్పుచేసి ప‌ప్పుకూడు.. వంటి చిత్రాలు న‌వ్వులు పూయిస్తుంటాయి. అలా ఎఫ్‌3 న‌వ్వులు పూయించింది” అని తెలిపారు.

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు