పట్టాల మధ్య నిద్రపోతున్న మహిళను దాటి దూసుకెళ్లిన రైలు..! ఇది వింత కాదు, నిజంగా జరిగింది..
ఎవరైనా ఇంట్లో నిద్రపోతారు. కూలీలు తమ పనిప్రదేశంలో కాసేపు ఓ కునుకు తీస్తారు..ప్రయాణవేళ్లలో అయితే వెయిటింగ్ హాల్స్‌ల్లో పడుకుంటారు..కానీ, ఇవీడేంటండి..ఏకంగా రైలు పట్టాల మధ్యలో నిద్రపోతోంది..అవునా..? అదేంటీ..ఆ రైల్వే ట్రాక్ నిరుపయోగంగా ఉండి ఉంటాయనే కదా మీ సందేహం.. కానీ, అదేదీ కాదు,
ఎవరైనా ఇంట్లో నిద్రపోతారు. కూలీలు తమ పనిప్రదేశంలో కాసేపు ఓ కునుకు తీస్తారు..ప్రయాణవేళ్లలో అయితే వెయిటింగ్ హాల్స్‌ల్లో పడుకుంటారు..కానీ, ఇవీడేంటండి..ఏకంగా రైలు పట్టాల మధ్యలో నిద్రపోతోంది..అవునా..? అదేంటీ..ఆ రైల్వే ట్రాక్ నిరుపయోగంగా ఉండి ఉంటాయనే కదా మీ సందేహం.. కానీ, అదేదీ కాదు, ఆ మార్గంలో ప్రతి గంటకు ఎన్నో రైళ్లు వెళ్తుంటాయి. అలాంటి మార్గంలో మహిళ పట్టాలపై ఎలా నిద్రపోయిందనేది, అసలు ఎలా బతికి బయటపడింది అనేది అంతపట్టని రహాస్యం..ఈ ఘటన మాత్రం ఔరంగబాద్ నగంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఔరంగాబాద్ నగరంలోని చిఖల్తానా రైల్వే ట్రాక్‌పై 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది ఎక్స్‌ప్రెస్ రైలు.. ఇంజన్, మూడు కోచ్‌లు వేగంగా వెళ్లిపోయిన తర్వాత ట్రైయిన్ ఒక్కసారిగా ఆగిపోయింది. రైల్లోని జనాలు అరుపులు, కేకలు వేస్తూ పట్టాలపై పడుకుని ఉన్న మహిళను నిద్రలేపారు..ఆదివారం తెల్లవారుజామున నగర సమీపంలోని రైలు పట్టాల మధ్యలో నిద్రపోతున్న మహిళ గాఢనిద్రలోంచి అద్భుతంగా బయటపడింది.
అది జాల్నా-దాదర్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు.. డ్రైవర్లు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఔరంగాబాద్, చికల్తానా మధ్య ఉన్న ముకుంద్‌వాడి రైల్వే స్టేషన్ దాటారు.. పట్టాల వెంబడి రైలు అతి వేగంగా దూసుకెళ్తుండగా, దూరంగా పట్టాలపై ఓ మహిళ పడుకుని ఉండటం గుర్తించారు. వెంటనే హారన్ మోగించారు..కానీ, సదరు లేడీ ఒక్క అంగుళం కూడా కదలకపోవడంతో డ్రైవర్‌లు అమిత్ సింగ్, ధీరజ్ థోరట్‌లు చాకచక్యంగా వ్యవహరించిన వేగంగా బ్రేకులు వేసి రైలును ఆపేశారు. రైలు ఆగిపోయే సమయానికి, దాని ఇంజిన్ , మూడు కంపార్ట్‌మెంట్లు మహిళపైకి వచ్చాయి. రైల్లో ఉన్న ప్రయాణీకులలో కొందరు కిందకు దిగారు. గట్టి గట్టిగా అరుస్తూ, ఆమెను ట్రాక్‌ల నుండి బయటకు లాగే ప్రయత్నం చేశారు..కానీ, ఆమెలో ఎలాంటి చలనం కనిపించకపోవటంతో చిన్న చిన్న గులకరాళ్లను ఆమెపైకి నిద్రలేపారు. ఆ తర్వాత మాత్రమే మహిళ మేల్కొంది. దాంతో ఆమెను ప్రయాణికులు బయటకు లాగేశారు. అయితే ఈ ఘటన మొత్తాన్ని కొందరు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించడంతో వార్త వైరల్‌గా మారింది.
అయితే రైలు పట్టాలపై మహిళ నిద్రపోయిందని చెబుతున్న మాటలను సీనియర్ రైల్వే అధికారులు ఖండించారు. రైల్వే ట్రాక్‌పై పడుకోవటం అవాస్తం..ఆమె ఖచ్చితంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటుందని ఆరోపించారు. జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సాయంతో సదరు మహిళ భర్తకు సమాచారం అందించారు. అనంతరం ఆమెను తన భర్తకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి నేరం నమోదు కానప్పటికీ, ఈ సంఘటన రైల్వే లాగ్‌లో నమోదు చేయబడింది. 13 నిమిషాల ఆలస్యం తర్వాత రైలు తిరిగి ప్రారంభమైంది.
औरंगाबादमधील व्हायरल व्हिडिओ; लोको पायलटच्या सतर्कतेमुळे महिला बचावली; पाहा नेमके काय घडले #Aurangabad #ViralVideo #indianrailway @RailMinIndia pic.twitter.com/5fTNUZbAGO
— SakalMedia (@SakalMediaNews) May 30, 2022
రైల్వే కార్యకర్త సంతోష్ సోమాని మాట్లాడుతూ జల్నా-దాదర్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు పట్టాలపై మహిళను గుర్తించిన తర్వాత రైలును అతి వేగంతో ఆపడం అభినందనీయమన్నారు. ముకుంద్‌వాడి రాజ్‌నగర్‌లో రైల్వే అండర్‌బ్రిడ్జి ఏర్పాటు చేయాలన్న పౌరుల డిమాండ్‌ను అధికారులు నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రజలు పట్టాలపైకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైన ఉందన్నారు.