Viral Video:అమ్మాయికి ఎంగేజ్‌మెంట్ రింగ్‌ తొడిగిన అబ్బాయి.. పాపం.. అలా, అందరిలో బిస్కెట్‌ అయ్యాడు

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. కోవిడ్‌ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయటంతో పెళ్లిళ్లు, ఫంక్షన్ల జోరు కొనసాగుతోంది. ఇకపోతే, పెళ్లి తంతులో భాగంగా జరిగే కొన్ని కొన్ని ఫన్నీ సీన్స్‌ వెంట వెంటనే సోషల్‌ మీడియాలో చేరిపోతూ నెటిజన్లను ఎంజాయ్‌ చేసేలా చేస్తున్నాయి.

Viral Video:అమ్మాయికి ఎంగేజ్‌మెంట్ రింగ్‌ తొడిగిన అబ్బాయి.. పాపం.. అలా, అందరిలో బిస్కెట్‌ అయ్యాడు
Engagement
Follow us
Jyothi Gadda

|

Updated on: May 31, 2022 | 9:41 AM

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. కోవిడ్‌ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయటంతో పెళ్లిళ్లు, ఫంక్షన్ల జోరు కొనసాగుతోంది. ఇకపోతే, పెళ్లి తంతులో భాగంగా జరిగే కొన్ని కొన్ని ఫన్నీ సీన్స్‌ వెంట వెంటనే సోషల్‌ మీడియాలో చేరిపోతూ నెటిజన్లను ఎంజాయ్‌ చేసేలా చేస్తున్నాయి. వ‌ధూవ‌రుల డ్యాన్స్ వీడియోలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఎవ‌రో ఒక‌రు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటాయి. అయితే, ఇక్కడ ఓ ఎంజెట్‌మెంట్‌కు సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో నవ్వులు పూయిస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు అయ్యో పాపం అబ్బాయి అంటూ ఫన్నీ కామెంట్స్‌ కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

పెళ్లికి సంబంధించి చాలా రకాల కార్యక్రమాలు ఉంటాయి. పెళ్లి చూపులు మొదలు..పెళ్లి తర్వాత 16 రోజుల పండగ వరకు అన్ని వేడుకలే. అయితే, ఇక్కడ 16రోజులు కాదుగానీ, మూడు నుంచి ఐదు రోజులు మాత్రం ఖచ్చితంగా పెళ్లి సందడి కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి కార్యక్రమాల్లో వధూవరులు చేసే పనుల్లో తెలిసో తెలియ‌కో జ‌రిగిపోయే స‌న్నివేశాలు ఒవ‌రో ఒక‌రు వీడియో తీసి తెగ వైర‌ల్ చేస్తుంటారు. అలాగే ప్ర‌స్తుతం ఓ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

అయితే సాధార‌ణంగా ఎంగేజ్ మెంట్ లో అబ్బాయి, అమ్మాయి రింగులు మార్చుకునే కార్య‌క్ర‌మం ఉంటుంది. అయితే ఓ ఇంట్లో జ‌రిగే ఎంగేజ్ మెంట్ లో ఫ‌న్నీ ఇన్సిడెంట్ జ‌రిగింది. ఎంగేజ్‌మెంట్‌లో అమ్మాయి, అబ్బాయి రింగులు మార్చుకోవటం సర్వసాధారణం. అలాగే ఇక్కడ కూడా ముందుగా అమ్మాయి అబ్బాయి చేతికి రింగ్‌ తొడిగి కాళ్లకు నమస్కారం చేసింది. ఇక ఆ తర్వాత అబ్బాయి వంతు..అతను కూడా అమ్మాయి చేతి వేలికి ఉంగరం పెట్టి..కాళ్లకు నమస్కారం చేశాడు..దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. పగలబడి నవ్వుకున్నారు. వెంటనే అబ్బాయి పక్కనే ఉన్న మరో వ్యక్తి అతన్ని పైకి లాగేశాడు..నువ్ మొక్క కూడ‌దురా అన్న‌ట్లు చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ఎందుకంటే, పెళ్లిలో అబ్బాయి కాళ్లకు అమ్మాయి నమస్కారం చేస్తుంది. కానీ, అమ్మాయి కాళ్లకు అబ్బాయి చేయటం అనేది చాలా పెళ్లిళ్లలో కనిపించదు. ఇక్కడ అబ్బాయి అమ్మాయి కాళ్లకు దండం పెట్టడంతో వీడియో కాస్త నెటిజన్లను కూడా నవ్విస్తోంది.

ఇలాంటి ఫన్నీ వీడియోలు TV9 వెబ్ సైట్ లో మరెన్నో చూడొచ్చు..