గుర్రంపై బరాత్‌కు బయల్దేరిన వరుడు..మెడపై ఎక్కిన కుర్రకారు నాగిని డ్యాన్స్..బాబోయ్!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కరోనా, లాక్‌డౌన్ కారణంగా గత రెండుమూడేళ్లుగా పెళ్లిళ్లకు బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి పెళ్లిళ్ల జోరు కొనసాగుతోంది. ఇక ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కరోనా, లాక్‌డౌన్ కారణంగా గత రెండుమూడేళ్లుగా పెళ్లిళ్లకు బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి పెళ్లిళ్ల జోరు కొనసాగుతోంది. ఇక ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి వేడుకలలో కొందరు వధువరులు వెరైటీ ఎంట్రీ, చిరు కోపాలు, ఎమోషనల్ అవ్వడం, వేదిక మీద కొట్టుకోవడం వంటి వెరైటీ కారణాలతో వెడ్డింగ్ లు వైరల్ గా మారాయి. తాజాగా పెళ్లిలో డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వీడియో చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియో.. ఊరేగింపులో నాగిని డ్యాన్స్‌కు సంబంధించినది. డ్యాన్స్ చేస్తూ యువకుడి చేసిన హంగామా మామూలుగా లేదు..ఈ వీడియో పాతదే అయినా తాజాగా మళ్లీ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పెళ్లి బరాత్ వైభవంగా బయటకు వస్తోంది. ఈ సమయంలో వరుడు గుర్రంపై కూర్చున్నట్లు కనిపిస్తాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో డీజే పాటలు ప్లే అవుతున్నాయి. అదే సమయంలో, బారాతీలు కూడా సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. అయితే అప్పుడే ఫ్రేమ్‌లోకి ఓ కుర్రాడు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు..పెళ్లికొడుకు ముందు కుర్రాడి మెడపై కూర్చుని ఓ ఊగిపోతూ డ్యాన్స్ చేస్తున్నాడు. యువకుడి మెడపై కూర్చుని నాగిని డ్యాన్స్‌తో హల్‌చల్ చేస్తున్నాడు. కుర్రాడి మెడపై కూర్చున్న యువకుడి డ్యాన్స్ స్టెప్పులు చూసి వరుడు కూడా భయపడతాడు. అంతేకాదు, డ్యాన్స్ చేస్తూనే వరుడి నోటిలో పెడుతున్న నోట్లను ఒక్కొక్కటిగా తీసుకోవటం కూడా మనం వీడియోలో చూడొచ్చు..ఇకపోతే, ఈ యువకుడి డ్యాన్స్‌కు అక్కడున్న వారితో పాటు, వీడియో చూసిన నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. వీడియోని పలుమార్లు రిపీట్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తమదైన స్టైల్లో భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
ఈ వీడియో సోషల్ వీడియో ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలమంది వీక్షించారు. అదే సమయంలో వేల మంది లైక్ చేసారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా రియాక్షన్స్ ఇస్తున్నారు.