Costly Bucket: ఒక్క ప్లాస్టిక్‌ బకెట్‌ ధర రూ.25 వేలా..? బకెట్‌ కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాలా.?

Costly Bucket: ఒక్క ప్లాస్టిక్‌ బకెట్‌ ధర రూ.25 వేలా..? బకెట్‌ కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాలా.?

Anil kumar poka

|

Updated on: May 31, 2022 | 9:59 AM

ఆన్‌లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు షాపులకు వెళ్లే పని తప్పింది. ఏది కొనాలన్నా ఆన్‌లైన్‌లోనే. అయితే తాజాగా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన ఓ ప్లాస్టిక్‌ బకెట్‌ ధర చూసి వినియోగదారులు షాకవుతున్నారు.


ఆన్‌లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు షాపులకు వెళ్లే పని తప్పింది. ఏది కొనాలన్నా ఆన్‌లైన్‌లోనే. అయితే తాజాగా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన ఓ ప్లాస్టిక్‌ బకెట్‌ ధర చూసి వినియోగదారులు షాకవుతున్నారు. అవును, ఒక ట్విట్టర్ యూజర్ ఇటీవల అమెజాన్‌లో పింక్ ప్లాస్టిక్ బకెట్‌ను చూశారు. ఈ బకెట్ ధర 25,999 రూపాయలట. ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే దీని అసలు ధర 35,900 రూపాయలు కాగా 28 శాతం తగ్గింపుతో 25,999 రూపాయలకు అమ్మకానికి పెట్టారట. ఈఎంఐలో కట్టుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చారట. అయితే ప్రస్తుతం ఈ బకెట్‌ స్టాక్‌ లేదు. కాగా ఈ ప్లాస్టిక్ బకెట్ ధర చూసి పలువురు అవాక్కవుతున్నారు. బాత్ రూమ్‌లో, ఇంటి అవసరాలకు వాడే ప్లాస్టిక్ బకెట్ కు ఇంత ధరను ఎలా నిర్ణయిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా డిస్కౌంట్‌ కూడానూ.. అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బకెట్ కు సంబంధించిన ధమాకా ధర పై ట్విటర్ లో వాడివేడి చర్చ నడుస్తోంది. ఆ ప్లాస్టిక్ బకెట్ స్క్రీన్ షాట్ తో చాలా మంది పోస్ట్ లు చేశారు. ఈ బకెట్ తో పాటు బాత్ రూమ్ ను కూడా కాంప్లిమెంటరీగా ఇస్తారేమో అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘ఈ బకెట్ నీళ్లను లిక్కర్ గా మారుస్తుందేమో’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరు.. ఈ బకెట్ ను కొనాలంటూ కిడ్నీలు అమ్ముకోవాలేమో అంటూ కామెంట్ చేశారు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Published on: May 31, 2022 09:59 AM