Petrol-Diesel Price Today: మళ్లీ పెరుగుతున్న క్రూడాయిల్.. తాజాగా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Petrol-Diesel Price Today: యూరోపియన్ యూనియన్ రష్యా ముడి చమురుపై ఆంక్షలు విధించిన కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర దాదాపు 120 డాలర్లకు పైనే ట్రేడ్ అవుతోంది.
Petrol-Diesel Price Today: యూరోపియన్ యూనియన్ రష్యా ముడి చమురుపై ఆంక్షలు విధించిన కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర దాదాపు 120 డాలర్లకు పైనే ట్రేడ్ అవుతోంది. రానున్న కాలంలో మళ్లీ పెట్రోడీజిల్ రేట్లు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత మే 22న దేశవ్యాప్తంగా చమురు ధరలు లీటరుకు రూ.7 నుంచి రూ.9.5 వరకు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం తర్వాత, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై విధించే వ్యాట్‌ని కొంత మేర తగ్గించాయి. అక్కడి ప్రభుత్వాల నిర్ణయంతో ఆ రాష్ట్రాల్లోని ప్రజలకు పెట్రోల్,డీజిల్ ధరలపై కొంత ఉపశమనం లభించింది.
ఈరోజు ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.96.72 ఉండగా, డీజిల్ రూ.89.62కు చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35 కాగా, డీజిల్ ధర రూ.97.28గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.74గా, డీజిల్ ధర రూ.94.33గా ఉంది. అదే సమయంలో కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర లీటరుకు రూ.97.82గా ఉంది.
పెట్రోల్ పై పన్ను ఎలా విభజించబడింది?
ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంది. ఇందులో బేస్ ధర రూ.57.13 కాగా, ఛార్జీ రూ.0.20. ఈ విధంగా, డీలర్లకు ఛార్జీ రూ. 57.33 అవుతుంది. ఇప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని రూ.19.90కి, వ్యాట్ రూ.15.71కి తగ్గించారు. డీలర్ కమీషన్ రూ.3.78. దీన్ని పెంచాలన్న డిమాండ్ ఉంది.