AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీమ ప్రజల గుండె చప్పుడు.. సిద్దేశ్వరం అలుగు సిద్ధించేనా? పార్టీలకతీతంగా కదిలిన రైతాంగం

సీమ ప్రజల గుండె చప్పుడు.. ప్రజల హృదయ స్పందన..సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టు. అలుగు నిర్మాణం వలన కరువు సీమ దాహార్తి తీరడమే గాక సాగునీరు లభిస్తుంది. అలుగు నిర్మాణం వలన రాయలసీమ సామాజికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నది సీమ వాసుల అభిప్రాయం.

సీమ ప్రజల గుండె చప్పుడు.. సిద్దేశ్వరం అలుగు సిద్ధించేనా?  పార్టీలకతీతంగా కదిలిన రైతాంగం
Siddeshwaram
Follow us
Jyothi Gadda

|

Updated on: May 31, 2022 | 3:53 PM

సీమ ప్రజల గుండె చప్పుడు.. ప్రజల హృదయ స్పందన..సిద్దేశ్వరం అలుగు. అలుగు నిర్మాణం వలన కరువు సీమ దాహార్తి తీరడమే గాక సాగునీరు లభిస్తుంది. అలుగు నిర్మాణం వలన రాయలసీమ సామాజికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నది సీమ వాసుల అభిప్రాయం. అత్యంత ప్రాధాన్యత కలిగిన రాయలసీమ జీవనాడిగా పేర్కొన్న సిద్దేశ్వరం అలుగు నిర్మాణం మరొకసారి ఉద్రిక్తతలకు తావిస్తోంది. నేడు రాయలసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి వేలాది మంది రైతులు పార్టీలకతీతంగా నిర్మాణం కోసం నడుం బిగించారు. అడుగడుగునా పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ ఎదుర్కొని వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

సరిగ్గా ఆరేళ్ల క్రితం…. అంటే మే 31, 2016లో సిద్దేశ్వరం అలుగు నిర్మాణం కోసం రాయలసీమ జలసాధన సమితి చేపట్టిన శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. వేలాది మంది రైతులు కాలినడకన వెళ్లి శంకుస్థాపన చేపట్టారు. ఎక్కడికక్కడ రైతులను అరెస్టు చేసినప్పటికీ శంకుస్థాపన కార్యక్రమం మాత్రం చేయగలిగారు. సరిగ్గా ఆరేళ్ల క్రితం అంటే నేడు మరోసారి నిర్మాణం చేపట్టేందుకు వేలాది మంది రైతులు నడుంబిగించారు. సిద్దేశ్వరం అలుగు పరిసర ప్రాంతాలలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయినప్పటికీ కూడా రైతులు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సిద్దేశ్వరం అలుగు నిర్మించాలని రాయలసీమ జలసాధన సమితి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నది.. సీమ జిల్లాలకు సాగు, తాగునీరు పుష్కలంగా లభిస్తుంది. ఈ ప్రాజెక్టును విస్మరించడంతో రైతులే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమ శ్రమ దానంతో , సొంత ఖర్చుతో తమ ప్రాజెక్టులను తామే నిర్మించకుంటామని శపథం చేశారు.

ఇవి కూడా చదవండి

రాయలసీమ జలసాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి ఇప్పటికే ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందే ప్రాంతాలన్నీ తిరిగి రైతులను చైతన్యం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి భారతీయ జనతాపార్టీ కూడా సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. టిడిపి కూడా అదే పరిస్థితిలో ఉంది. పార్టీలకతీతంగా ప్రాజెక్టును తామే నిర్మించుకుంటామని ఎవరు అడ్డు చెప్పవద్దు అని కోరుతున్నారు. రాయలసీమ జిల్లాలకు చెందిన ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్దేశ్వరం అలుగు పై దృష్టి సారించాలని కోరారు. సిద్దేశ్వర మీదుగానే ప్రస్తుతం జాతీయ రహదారి నిర్మాణం జరగబోతోందని ఈ ప్రాంతంలో వంతెనకు కూడా నిర్మించాల్సి ఉంది. దీంతో పనిలో పనిగా అలుగు నిర్మాణం చేయడం చాలా ఈజీ అని, పాలకులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.