AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Birthplace: మారుతి మా వాడంటే మావాడే.. అంజనీపుత్రుడి జన్మస్థలిపై నాసిక్‌లో కొనసాగుతున్న ధర్మసంసద్..

మారుతి మా వాడంటే మావాడే అంటూ గట్టిగా క్లెయిమ్ చేసుకుంటున్నాయి 12 ప్రాంతాలు. ఈ క్రమంలోనే నాసిక్‌లో ధర్మసంసద్ పేరిట భేటీ అయ్యారు సాధుసంతులు. పోటాపోటీ వాదాలతో వేడెక్కే అవకాశం ఉండడంతో సనాతన వాదులంతా..

Hanuman Birthplace: మారుతి మా వాడంటే మావాడే.. అంజనీపుత్రుడి జన్మస్థలిపై నాసిక్‌లో కొనసాగుతున్న ధర్మసంసద్..
Hanuman Janmasthali
Sanjay Kasula
| Edited By: Anil kumar poka|

Updated on: May 31, 2022 | 4:14 PM

Share

హనుమంతుడి(Hanuman) జన్మస్థలంపై రగడ రగడగానే కంటిన్యూ అవుతోంది. అంజనీ పుత్రుడు పుట్టింది ఎక్కడ… పురాణ ఇతిహాసాలు ఏం చెబుతున్నాయి అనే వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. తాజాగా నాసిక్‌లో జరిగిన సాధు సంతుల సమావేశం అసలు విషయాన్ని తేల్చకుండా అడ్డదారి పట్టింది. మారుతి మా వాడంటే మావాడే అంటూ గట్టిగా క్లెయిమ్ చేసుకుంటున్నాయి 12 ప్రాంతాలు. ఈ క్రమంలోనే నాసిక్‌లో ధర్మసంసద్ పేరిట భేటీ అయ్యారు సాధుసంతులు. పోటాపోటీ వాదాలతో వేడెక్కే అవకాశం ఉండడంతో సనాతన వాదులంతా ధర్మ సంసద్‌పై ఫోకస్ చేశారు. నేషనల్ మీడియా మొత్తం నాసిక్‌లో మకాం వేసింది. హనుమంతుడి జన్మస్థలం వివాదానికి పరిష్కారమే అక్కడ మెయిన్ ఎజెండా. కానీ.. జరిగింది, జరుగుతున్నది మాత్రం పూర్తిగా విరుద్ధం.

ఎవరికివారు పుస్తకాలు, సాక్ష్యాధారాలతో సిద్ధమయ్యారు. కానీ… సంసద్‌ని ఎవరు లీడ్ చేయాలన్న విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది. భేటీలో ఎవరికి పెద్దపీటలెయ్యాలి… కిందెవరు కూర్చోవాలి… పైనెవరు కూర్చోవాలన్న ఆధిపత్య పోరుతో సాధువుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో… కర్నాటకకు చెందిన కొందరు సాధువులు సమావేశం నుంచి బాయ్‌కాట్ చేశారు.

శాస్త్ర చర్చ కోసం వచ్చి గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు అని నిలదీశారు గోవిందానంద సరస్వతి. గంట సేపు నేను నిలబడే ఉన్నా… నాకున్న ఓపిక వాళ్లకెందుకు లేదు అని అడిగేశారు. అటు… హనుమత్ జన్మభూమిపై అసలు వివాదమే లేదన్నారు గోవిందానంద సరస్వతి. పంపా క్షేత్రంలోని కిష్కిందలోనే మారుతి జన్మించారన్న విషయాన్ని ఎక్కడికైనా వచ్చి చెబుతామన్నారు.

ఇవి కూడా చదవండి

అటు… నాసిక్‌లో జరిగే సంత్‌ సంసద్‌కి టీటీడీ దూరంగా ఉంది. టీటీడీ పండిత పరిషత్‌కు ఆహ్వానం అందినప్పటికే హాజరు కాలేదు. అంజనాద్రి జన్మస్థలమని ఎప్పుడో నిర్దారించాం, పరిష్కారం చూపించాక మళ్లీ వాదన వినిపించాల్సిన అవసరమేంటి? అనేది టీటీడీ వెర్షన్. తిరుమల అంజనాద్రే జన్మస్థలమన్న నిజం వెలుగులోకి వస్తుందంటోంది టీటీడీ.

హనుమంతుడి జన్మస్థలం విషయంపై ఎప్పటికప్పుడు కొత్త అంశాలు అంశం తెరపైకి వస్తూనే ఉన్నాయి. తిరుమల తిరుపతిలోని ఏడుకొండల్లో ఒకటైన అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం అంటూ గతంలో టీటీడీ ఆస్థాన పండితులు వాదిస్తే… కర్నాటకలోని కిష్కింద ఆంజనేయుడి జన్మస్థలం అంటూ అక్కడి పండితులు వాదిస్తున్నారు.

హనుమంతుడు అటు అంజనాద్రిలోనూ, ఇటు కిష్కిందలోనూ జన్మించలేదని..మహారాష్ట్రలోని ఆంజనేరి పర్వతాల్లో జన్మించారని మరో వాదన తెరపైకి వచ్చింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికే… శ్రీ మండలాచార్య మహంత్ పీఠాదిపది స్వామి అనికేత్ శాస్త్రి దేశ్‌పాండే మహారాజ్ నాసిక్‌లో ధర్మ సంసద్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంసద్ లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు తరలివచ్చారు. కానీ… ఒరిగింది మాత్రం శూన్యం.

తిరుమలలోని అంజనాద్రి, కర్నాటకలోని కిష్కింద, కర్నాటకలోని హంపి- గోకర్ణ, నాసిక్‌లోని అంజనేరి… ఇవి మాత్రమే కాదు… గుజరాత్‌లోని నవసారి, జార్ఖండ్‌లోని అంజన్ గ్రామం, హర్యానాలోని కపితల్ ప్రాంతం, రాజస్థాన్‌లోని లక్షక గుట్టలు, అటు నేపాల్‌లోని హనుమాన్‌ ధోకా దేవాలయం… ఇలా 12 వైపుల నుంచి చుట్టుముట్టిన ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందన్నది క్వశ్చన్‌మార్క్‌గా మారింది. అటు… దేవుడికి ప్రాంతీయవాదం అంటగట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు మధ్యేవాదులు.

ఆధ్యాత్మిక వార్తల కోసం