Koratala Siva : తారక్ సినిమా తర్వాత కొరటాల డైరెక్ట్ చేసేది ఆ స్టార్ హీరోనే..
మొన్నటి వరకు వరుస సక్సెస్ లతో దూసుకుపోయారు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. ఆయన రీసెంట్ గా మెగా స్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా తెరకెక్కించారు.

మొన్నటి వరకు వరుస సక్సెస్ లతో దూసుకుపోయారు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva). ఆయన రీసెంట్ గా మెగా స్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య (Acharya)సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. ఆచార్య సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దాంతో మెగా ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ప్రస్తుతం కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కొరటాల ఇందులో ఎన్టీఆర్ లుక్‌ను పూర్తిగా మార్చేయనున్నాడని చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వర్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. రీసెంట్ గా తారక్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ తారక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఎవరితో సిబినిమా చేయనున్నాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. కొరటాల తారక్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలని చూస్తున్నారట. కొరటాలతో సోలో హీరోగా సినిమా చేయడానికి చరణ్ సుముఖంగానే ఉన్నాడని అంటున్నారు. చరణ్ కోసం ఓ పవర్ ఫుల్ కథను కూడా సిద్ధం చేస్తున్నారట కొరటాల. అలాగే ఈ సినిమాతర్వాత కొరటాల బాలకృష్ణ తో సినిమా చేయనున్నాడని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.




