Prakash Raj: ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషంగానూ.. గర్వంగాను ఉంది: ప్రకాష్ రాజ్
తనదైన విలక్షణ నటనతో అన్ని భాషల్లో పేరు సంపాదించుకున్నారు ప్రకాష్ రాజ్. ఇప్పటి వరకు ఆయన అనేక పాత్రల్లో నటించి మెప్పించారు.

తనదైన విలక్షణ నటనతో అన్ని భాషల్లో పేరు సంపాదించుకున్నారు ప్రకాష్ రాజ్(Prakash Raj). ఇప్పటి వరకు ఆయన అనేక పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రతినాయకుడిగా, హీరో ,హీరోయిన్ తండ్రిగా, ఎన్నో వైద్యమైన పాత్రల్లోనటించి ఆకట్టుకున్నారు ప్రకాష్ రాజ్. తాజాగా ప్రకాష్ రాజ్ నటించిన మేజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. యంగ్ హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో 6/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు డైరెక్టర్ శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పలు నగరాల్లో మేజర్ ప్రివ్యూస్ షోలు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. తాజాగా ఓ ఇంట్రవ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు.
మేజర్ హృదయాన్ని హత్తుకునే సినిమా.. ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు ప్రకాష్ రాజ్. మేజర్ మూవీలో నా పాత్ర ప్రతి ఒక్క రికీ కనెక్ట్ అవుతుంది. ఇందులో నేను కూడా ఒక భాగమైనందుకు సంతోషంగానూ, గర్వంగాను ఉంది అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన సినిమా ఇది అంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్. అడివి శేష్ సరసన కథానాయికగా సయీ మంజ్రేకర్ అలరించనుంది. తెలుగు, హిందీ, మలయాళం భాషలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘మేజర్’లో.. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు.







