Vikram: రిలీజ్‌కు ముందే భారీ లాభాలు.. అడ్వాన్స్ బుకింగ్స్‌తో దుమ్మురేపిన కమల్‌ హాసన్ ‘విక్రమ్’.. ఎంతంటే?

ఈ సినిమా విడుదలకు ముందే రూ. 204 కోట్ల బిజినెస్ చేసింది. సినిమా మొత్తం బడ్జెట్ రూ.150 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ కోణంలో ఈ సినిమా విడుదలకు ముందే రూ. 54 కోట్లకు పైగా లాభాలను రాబట్టింది.

Vikram: రిలీజ్‌కు ముందే భారీ లాభాలు.. అడ్వాన్స్ బుకింగ్స్‌తో దుమ్మురేపిన కమల్‌ హాసన్ 'విక్రమ్'.. ఎంతంటే?
Vikram
Follow us
Venkata Chari

|

Updated on: Jun 01, 2022 | 6:03 AM

ఈ రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ వర్సెస్ సౌత్ హవా నడుస్తోంది. ఒకవైపు బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలవుతుండగా, సౌత్ సినిమాల క్రేజ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. వలిమై, ఆర్ఆర్ఆర్(RRR), కేజీఎఫ్-2(KGF-2) తర్వాత, ప్రస్తుతం కమల్ హాసన్ తాజా సినిమా విక్రమ్ కూడా విడుదలకు ముందే హిట్ కొట్టేసేంది. ఈ సినిమా విడుదలకు ముందే రూ. 204 కోట్ల బిజినెస్ చేసింది. సినిమా మొత్తం బడ్జెట్ రూ.150 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ కోణంలో ఈ సినిమా విడుదలకు ముందే రూ. 54 కోట్లకు పైగా లాభాలను రాబట్టింది. కమల్ కెరీర్‌లో ప్రీ రిలీజ్‌లో ఇంత బిజినెస్ చేసిన తొలి సినిమా ఇదేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. విక్రమ్‌ సినిమాని లోకేష్‌ కంగరాజ్‌ డైరెక్షన్ చేశారు. సౌత్ సినిమాలు అడ్వాన్స్‌గా కోట్లకు పడగలెత్తుతున్నాయి. విక్రమ్ కూడా ఇదే ట్రెండ్‌ను కొనసాగించింది.

ఈ సంవత్సరం ఇప్పటివరకు, బచ్చన్ పాండే, ఝుండ్, ఎటాక్, గంగూబాయి కతియావాడి, ధాకడ్, జయేష్‌భాయ్ జోర్దార్, భూల్ భూలయ్య 2, ఢాకడ్ డిజాస్టర్‌లో విడుదలయ్యాయి. అయితే వీటిలో గంగూబాయి కతియావాడి, భూల్ భూలయ్య మాత్రమే రూ. 100 కోట్ల క్లబ్‌ను దాటాయి. మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. మరోవైపు, కంగనా నటించిన ఢాకడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా బడ్జెట్ రూ. 80 నుంచి రూ.90 కోట్లు కాగా ఇప్పటి వరకు కేవలం రూ.3 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. విడుదలైన 8వ రోజు కేవలం 20 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

కమల్ తాజా చిత్రం విక్రమ్.. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో రానున్న ఈ సినిమా.. ఓటీటీ హక్కులు, అడ్వాన్స్ బుకింగ్ నుంచే భారీగా లాభాలను దక్కించుకుంది. సౌత్ ఇండస్ట్రీ ట్రేడ్ అనలిస్ట్, ట్రాకర్ రమేష్ బాలా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి సమాచారం అందించారు. విక్రమ్ కమల్ హాసన్ అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ ఫిల్మ్ అని అతను పేర్కొన్నాడు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌తో పాటు ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇవి కూడా చదవండి

Vikram (1)

కమల్-విజయ్ జోడీగా..

కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా జూన్ 3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు విజయ్ సేతుపతి, శివాని నారాయణ్, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అదే సమయంలో సూర్య కూడా అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాతో కమల్ నాలుగేళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వస్తున్నారు.

ఈ సినిమా విడుదలకు 4 రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్..

కమల్ హాసన్ అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ కోసం బారులు తీరారు. ఈ సినిమా టిక్కెట్ల కోసం అభిమానులు తెల్లవారుజామున 4 గంటల నుంచే క్యూలు కట్టారు. ‘విక్రమ్’ సినిమాకి సౌత్‌లోని పెద్ద నగరాల్లో మంచి డిమాండ్ ఉంది. అందులో చెన్నై కూడా ఉంది. అదే సమయంలో, ఒక అభిమాని ఈ చిత్రం కోసం 60 టిక్కెట్లు తీసుకున్నాడు. టిక్కెట్టుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడతో, అది వైరల్ అవుతోంది.

పాన్ ఇండియా అనేది కొత్త కాన్సెప్ట్ కాదు..

కమల్ ఇటీవల తన సినిమా ప్రమోషన్‌లో బాలీవుడ్ పరిశ్రమ, సౌత్ ఇండస్ట్రీ మధ్య కొనసాగుతున్న భాషా వివాదంపై కూడా మాట్లాడారు. పాన్ ఇండియా సినిమాలు ఎప్పటినుంచో తీస్తూనే ఉన్నారని అన్నారు. ఇది కొత్తేమీ కాదంటూ తేల్చిచెప్పారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, శాంతారామ్ జీ పాన్ ఇండియా సినిమా తీశారు. పదోసన్ పాన్ ఇండియా చిత్రమే. మెహమూద్ జీ సినిమాల్లో కూడా తమిళం మాట్లాడాడు. మీరు మొఘల్-ఏ-ఆజామ్‌ని ఏమని పిలుస్తారు? ఇది నాకు మాత్రం పాన్ ఇండియా సినిమా. ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. మన దేశం విశిష్టమైనది. మనం వివిధ భాషలు మాట్లాడతాం. కానీ, మనమందరం ఒక్కటే. ఇది మన దేశ సౌందర్యం అంటూ ఆయన పేర్కొన్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..