AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: సల్మాన్ సినిమాలో వెంకటేష్.. వెంకీ మామ షూటింగ్‌లో జాయిన్ అయ్యేది అప్పుడేనట

కుర్ర హీరోలకు గట్టిపోటీ ఇవ్వడంలో ముందు వరసలో ఉంటారు విక్టరీ వెంకటేష్. యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నారు.

Venkatesh: సల్మాన్ సినిమాలో వెంకటేష్.. వెంకీ మామ షూటింగ్‌లో జాయిన్ అయ్యేది అప్పుడేనట
Venkatesh
Rajeev Rayala
|

Updated on: Jun 01, 2022 | 6:30 AM

Share

కుర్ర హీరోలకు గట్టిపోటీ ఇవ్వడంలో ముందు వరసలో ఉంటారు విక్టరీ వెంకటేష్(Venkatesh). యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నారు. అలాగే సోలో హీరోగానూ విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు వెంకీ. రీసెంట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ కెత్తో కలిసి ఎఫ్ 3 సినిమా చేసి సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా తో పాటు హిందీలో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు వెంకీ. ఈ సిరీస్ లో రానా కూడా నటించనున్నాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయానికి సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

సల్మాన్ ఖాన్ హీరోగా ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తుంది. పూజ అన్న పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారని బీ టౌన్ లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ లో జరగనుంది. జూన్ 10వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగులో వెంకటేశ్ పాల్గొంటారు. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలోని ధర్మస్థలి సెట్ లోనే ఈ షూటింగ్ జరగనుందని తెలుస్తుంది. వెంకటేష్ కు సల్మాన్ కు మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే సల్మాన్ అడగ్గానే ఈ సినిమాలో నటించేందుకు వెంకీ ఓకే చెప్పారని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు