Trending: ఫోటోగ్రాఫర్‌ చేసిన సాహసం..విమానం రెక్కల అంచున విన్యాసం..వీడియో చూస్తే కళ్లు బైర్లే

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కొన్నిసార్లు ఆ వీడియోలు ఆహ్లాదకరంగా ఉండడం సహా మరికొన్ని వీడియోలు వెన్నులో వణుకును పుట్టిస్తాయి. అయితే ప్రస్తుతం నెట్టింట ఓ అద్భుతమైన వీడియో వైరల్ గా మారింది.

Trending: ఫోటోగ్రాఫర్‌ చేసిన సాహసం..విమానం రెక్కల అంచున విన్యాసం..వీడియో చూస్తే కళ్లు బైర్లే
Photographer
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 01, 2022 | 3:07 PM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కొన్నిసార్లు ఆ వీడియోలు ఆహ్లాదకరంగా ఉండడం సహా మరికొన్ని వీడియోలు వెన్నులో వణుకును పుట్టిస్తాయి. అయితే ప్రస్తుతం నెట్టింట ఓ అద్భుతమైన వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇంటర్‌ నెట్‌లో ఓ అద్భుతమైన వీడియో వైరల్ గా మారింది. అందులో ఎత్తైన కొండపై ఓ పెద్ద విమానం ఉంది. దాని రెక్కలపై ఓ మనిషి నడుస్తున్న దృశ్యాలు చూసిన ప్రతిఒక్కరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. ఆ వీడియోకు ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం అందులో ఏముందో మీరూ చూసేయండి.

చుట్టూ పచ్చని వాతావరణం, ఎటు చూసిన ఆకుపచ్చ రంగు అలుముకుని దట్టంగా కనిపిస్తున్న చెట్లు, గడ్డి మాత్రమే కనిపిస్తుంది. అది కూడా ఓ ఎత్తైన కొండ ప్రదేశంలా ఉంది. అంత ఎత్తులో రిటైర్డ్‌ బోయింగ్‌ విమానం ఒకటి నిలిచి ఉంది. దాని రెక్కపై ఓ ఫోటోగ్రాఫర్‌ నడుస్తూ చేసిన సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ దృశ్యం బాలిలోని బీచ్‌లో ఎత్తైన కొండపై కనిపించింది. ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని ఉంచారు. దాని రెక్కలు వందల అడుగుల లోతులో ఉన్నాయి. ఫోటోగ్రాఫర్‌లు దాని రెక్కల అంచు వరకు నడుస్తారు..ప్రేక్షకుల గుండె ఆగిపోయేలా అనిపించే క్షణాల్లో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ హల్‌చల్‌ చేస్తారు..ఇక్కడ కూడా సరిగ్గా అలాంటి సీనే కనిపించింది. ఓ ఫోటో గ్రాఫర్‌ విమానం రెక్కల అంచున నడుస్తున్న వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన ప్రజలు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. చాలా మంది ఎత్తైన ప్రదేశానికి వెళ్లాలంటే విపరీతమైన భయం. అలాంటి వారిని ఈ వీడియో మరింత భయపడేలా షాక్‌కు గురి చేస్తుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ? EarthPix ? (@earthpix)

బీచ్‌ కొండపై ఉన్న ఈ రిటైర్డ్‌ బోయింగ్‌ విమానం ఇది. ఇది ఉలువాటు బడంగ్‌ రీజెన్సీలోని నాంగ్‌-నాంగ్‌ బీచ్‌ సమీపంలో పర్యాటక లాడ్జ్‌గా దీనిని ఏర్పాటు చేశారు. అని ట్రావెల్‌ బ్లాగ్‌ రాసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్‌ బాక్స్‌లో పంచుకున్నారు. ఏమాత్రం అటుఇటు అయినాకూడా నేరుగా కిందపడిపోతారు..జర భద్రం గురూ అంటూ పలువురు కామెంట్‌ చేస్తున్నారు. ఈ వీడియో ఎర్తపిక్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియో షేర్‌ చేయబడింది. ఇప్పటి వరకు 11 మిలియన్లకు పైగా వీక్షలను పొందింది.