4 లిఫ్టులున్నా కూలీకి నరకం చూపించారు కదరా..! 21 ఫ్లోర్లు బరువు మోత.. కన్నీళ్లు పెట్టించిన కార్మికుడి దుస్థితి!
విలాసవంతమైన భవనంలో పనిచేస్తున్న ఓ నిర్మాణ కార్మికుడికి కనీస సౌకర్యం కూడా అందించకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భవనంలో నాలుగు లిఫ్టులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఓ కూలీకి వాటిని ఉపయోగించేందుకు అనుమతించకపోవడంతో రెండు భారీ కాంక్రీట్ దిమ్మలను తలపై మోసుకుంటూ 21వ అంతస్తు వరకు మెట్లెక్కాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

విలాసవంతమైన భవనంలో పనిచేస్తున్న ఓ నిర్మాణ కార్మికుడికి కనీస సౌకర్యం కూడా అందించకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భవనంలో నాలుగు లిఫ్టులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఓ కూలీకి వాటిని ఉపయోగించేందుకు అనుమతించకపోవడంతో రెండు భారీ కాంక్రీట్ దిమ్మలను తలపై మోసుకుంటూ 21వ అంతస్తు వరకు మెట్లెక్కాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను తొలుత డింప్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. అయితే ప్రస్తుతం ఆ వీడియో ఆయన ప్రొఫైల్‌లో కనిపించడం లేదు. ఈ వీడియోలో ఓ నిర్మాణ కార్మికుడు తలపై రెండు కాంక్రీట్ దిమ్మలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక్కో మెట్టు నెమ్మదిగా ఎక్కడం కనిపిస్తోంది. ఇలా అనేక అంతస్తులు దాటుకుంటూ 21వ అంతస్తుకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ వీడియోను చిత్రీకరిస్తున్న సమయంలో డింప్స్ భవనంలో ఉన్న నాలుగు లిఫ్టులను చూపిస్తూ.. కార్మికులకు మాత్రం వాటిని ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సరుకులను పై అంతస్తులకు తరలించేందుకు లిఫ్టులు ఉన్నప్పటికీ, కూలీలు మెట్ల మార్గాన్నే ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ప్రశ్నిస్తూ.. నాలుగు లిఫ్టులు ఉన్న భవనంలో పేద కార్మికులకు ఆ సౌకర్యం ఎందుకు అందుబాటులో లేదని నిలదీశారు.
ఆ తర్వాత ఈ వీడియోను ‘ఎక్స్’ (X) వేదికపై అమిత్ సింగ్ అనే యూజర్ రీషేర్ చేశారు. కార్మికులను లిఫ్టులు ఉపయోగించకుండా అడ్డుకోవడంపై తీవ్రంగా స్పందించారు. లిఫ్టులను కేవలం భవన నివాసితులకే పరిమితం చేయడం, నిర్మాణ పనుల కోసం పనిచేస్తున్న కూలీలను మాత్రం 21 అంతస్తుల వరకు బరువులు మోయించడం ప్రాథమిక మానవత్వానికి విరుద్ధమని విమర్శించారు.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. విలాసవంతమైన భవనాలు నిర్మించేది కార్మికుల శ్రమతోనే అయినప్పటికీ, అదే భవనంలోని కనీస సౌకర్యాలను వారికి నిరాకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఈ పరిస్థితిని ఆధునిక బానిసత్వంతో పోల్చగా, మరికొందరు కార్మికుల గౌరవం, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకే కనీస సౌకర్యాలు అందకపోవడం సమాజంలోని అసమానతలను మరోసారి బయటపెట్టిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై సంబంధిత భవన యాజమాన్యం స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
This worker is forced to carry heavy loads all the way up to the 21st floor, despite the building having 4 lifts reserved strictly for “residents only” Pure lack of basic humanity. https://t.co/Bx5RRe48tp
— Amit Singh (@RockstarAmit) October 29, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
