బేబీ కట్టింగ్‌లో భలేగా ఉంది సింహం..! ఇంతకీ ఈ కట్టింగ్ చేసిన బార్‌బార్ ఎవరబ్బా..?
ఒకప్పుడు సోషల్ మీడియా వినియోగం తక్కువగా ఉండేది. కేవలం కొద్దిమంది మాత్రమే ఫేస్ బుక్ సామాజిక మద్యమాలు వినియోగించేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో లేకపోతె జనాలు ఏమనుకుంటారో అనే స్టేజ్ కి వచ్చేసారు చాలామంది.
ఒకప్పుడు సోషల్ మీడియా వినియోగం తక్కువగా ఉండేది. కేవలం కొద్దిమంది మాత్రమే ఫేస్ బుక్ సామాజిక మద్యమాలు వినియోగించేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో లేకపోతె జనాలు ఏమనుకుంటారో అనే స్టేజ్ కి వచ్చేసారు చాలామంది. ఏ విషయమైనా నిమిషాల్లో ప్రజలకు చేరడానికి సోషల్ మీడియానే ఏకైక వేదికగా మారింది. అందరికీ సామాజిక మాధ్యమాల్లో అకౌంట్‌లు ఉండటంతో ప్రతీ రోజూ చాలా రకాల ఫోటోలు, వీడియోలను పోస్టు చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ సింహానికి సంబంధించిన ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టకుంటున్నాయి.
సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఈ సింహం…అందమైన బేబీ కట్టింగ్‌తో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఫొటోలో కనిపిస్తున్న సింహాన్ని చూసిన ప్రజలు అరె, సింహానికి బేబీ కటింగ్ చేయించారా..? భలేగా ఉందే..అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ వెంటనే తేరుకుని అయినా, సింహానికి కట్టింగ్ చేయగలిగిన సాహసవంతులు ఎవరా..? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు..ఇదో ఎక్కడో చైనాలోని గ్వాంగ్జౌ జూలోని సింహానికి సంబంధించిన ఫోటోగా తెలిసింది. అయితే, అక్కడి సింహాన్ని చూసిన సందర్శకులు…తొలుత ఆశ్చర్యపోయారట.. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి బేబీ కట్టింగ్‌తో భలేగా ఉన్న సింహాం..చూస్తే తెగ నవ్వుకుంటారు..అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇంకేముంది ఫొటోలు నెట్టింట విచ్చలవిడిగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో స్పందించిన జూ అధికారులు.. సింహానికి తామేం కటింగ్ చేయలేదని చెప్పేశారు.. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో సింహం జుట్టూ దానికి అదే ఇలా మారిపోయిందని వివరణ ఇచ్చారు.