Telangana: సివిల్స్ – 2021 విజేతలకు సన్మానం.. మరిన్ని విజయాలు సాధించాలన్న మంత్రి హరీశ్

యూపీఎస్సీ(UPSC) నిర్వహించిన సివిల్స్ - 2021 ఫలితాల్లో విజయం సాధించిన వారిని తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) సన్మానించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. సీఎస్‌బీ ఐఏఎస్...

Telangana: సివిల్స్ - 2021 విజేతలకు సన్మానం.. మరిన్ని విజయాలు సాధించాలన్న మంత్రి హరీశ్
Harish Rao
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 01, 2022 | 1:23 PM

యూపీఎస్సీ(UPSC) నిర్వహించిన సివిల్స్ – 2021 ఫలితాల్లో విజయం సాధించిన వారిని తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) సన్మానించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, మెంటార్ మల్లవరపు బాలలత నేతృత్వంలో ర్యాంకులు సాధించిన వారు మంత్రి హరీశ్ రావును కలిశారు. సివిల్స్ పరీక్షల్లో ర్యాంకులు సాధించి, తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా నిలిచారని మంత్రి అభినందించారు. సివిల్స్ విజేతలను సన్మానించి ప్రోత్సహించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. స్వయంగా ఐఏఎస్​అయిన బాలలత హైదరాబాద్‌(Hyderabad) లో శిక్షణా సంస్థ ఏర్పాటు చేసి ఇప్పటివరకు వందమందికపైగా సివిల్స్ విజేతలను తీర్చిదిద్దడం గర్వకారణమని కొనియాడారు. సీఎస్బీ అకాడమీ నుంచి భవిష్యత్తులో మరింత మంది విజేతలు రావాలని, దేశానికి అత్యున్నత సేవలు అందించాలని హరీశ్​రావు ఆకాంక్షించారు. 69వ ర్యాంకర్ గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి, 136వ ర్యాంకర్ అరుగుల స్నేహ, 161 ర్యాంకర్ బొక్కా చైతన్యరెడ్డి, 574వ ర్యాంకర్ రంజిత్ కుమార్, 676వ ర్యాంకర్ బి. స్మరణ్ రాజ్‌ లను మంత్రి హరీశ్‌ రావు సత్కరించారు.

రెండు రోజుల క్రితం యూపీఎస్సీ 2021 తుది ఫలితాలను ప్రకటించింది. శ్రుతి శర్మ టాపర్‌గా నిలవగా అంకితా అగర్వాల్ రెండో స్థానంలో, గామిని సింగ్లా మూడో టాపర్‌గా నిలిచారు. ప్రిలిమ్స్, మెయిన్ ఇంటర్వ్యూ రౌండ్ల తర్వాత తుది ఫలితం వెల్లడైంది. సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ముందు వరుసలో నిలిచారు. ఇందులో యశ్వంత్‌ కుమార్‌ రెడ్డికి 15వ ర్యాంకు దక్కింది.

పూసపాటి సాహిత్య (24), కొప్పిశెట్టి కిరణ్మయి (56), శ్రీపూజ (62), గడ్డం సుధీర్‌ కుమార్‌ రెడ్డి (69), ఆకునూరి నరేశ్‌ (117), అరుగుల స్నేహ (136), బి.చైతన్యరెడ్డి (161), ఎస్‌.కమలేశ్వర రావు (297), విద్యామరి శ్రీధర్‌ (336), దిబ్బడ ఎస్వీ అశోక్‌ (350), గుగులావత్‌ శరత్‌ నాయక్‌ (374), నల్లమోతు బాలకృష్ణ (420), ఉప్పులూరి చైతన్య (470), మన్యాల అనిరుధ్‌ (564), బిడ్డి అఖిల్‌ (566), రంజిత్‌ కుమార్‌ (574), పాండు విల్సన్‌ (602), బాణావత్‌ అరవింద్‌ (623), బచ్చు స్మరణ్‌రాజ్‌ (676) ర్యాంకులు దక్కించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి