Vijayawada: ఇంద్రకీలాద్రి సెక్యూరిటీ టెండర్ దక్కించుకున్న ఏజిల్.. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి దుర్గ గుడి సెక్యూరిటీ టెండర్ ను ఏజీఐఎల్ఈ(AGILE) సంస్థ దక్కించుకుంది. తెలంగాణలోని ఎంజీఎం ఆస్పత్రి నిర్వహణలో విఫలమైన ఏజిల్ సంస్థ ఇప్పటికే బ్లాక్ లిస్ట్ లో ఉంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో....
విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి దుర్గ గుడి సెక్యూరిటీ టెండర్ ను ఏజీఐఎల్ఈ(AGILE) సంస్థ దక్కించుకుంది. తెలంగాణలోని ఎంజీఎం ఆస్పత్రి నిర్వహణలో విఫలమైన ఏజిల్ సంస్థ ఇప్పటికే బ్లాక్ లిస్ట్ లో ఉంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం ఘటనలో ఇదే సంస్థ సెక్యూరిటీ అందించడంలో విఫలమైందని ఆరోపణలు వినవచ్చాయి. బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. అర్హత లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారని చెబుతున్నారు. ఈ అంశంపై దుర్గగుడి(Durga Temple) అధికారుల తీరు పైనా అనుమానాలు వ్యక్తం చేశారు. వరంగల్ ఎంజీఎంలో ఎలుకల దాడి చేసిన ఘటనలో ఓ రోగి మృతి చెందాడు. అప్పట్లో ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులు, సెక్యూరిటీ సంస్థపై చర్యలకు ఉపక్రమించారు. సెక్యూరిటీ సంస్థ అయిన ఏజిల్ ను బ్లాక్ లిస్ట్ లో పెడుతూ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడ దుర్గగుడిలో సెక్యూరిటీ టెండర్లను ఫిబ్రవరిలో నిర్వహించారు. మూడు సంస్థలు టెండర్లను దాఖలు చేశాయి. వీరిలో వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థకు సెక్యూరిటీ టెండర్‌ను ఇవ్వాలని నిర్ణయించారు. దాని ప్రకారం అత్యధిక టర్నోవర్ ఉన్న వివాదాస్పదమైన ఏజిల్ సంస్థకే టెండర్ అప్పగించారు. వాస్తవానికి దుర్గగుడి టెండర్లకు సంబంధించి అత్యధిక టర్నోవర్ ఎవరికి ఉంటే వారికే ఇవ్వాలనే నిబంధన పెట్టడంపైనే చాలాకాలంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి