IMD: ఈ వానాకాలంలో వద్దన్నా వానలే.. తెలంగాణలో మాత్రం అప్పటి నుంచే వర్షాలు

మండే ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన దేశ ప్రజలకు ఐఎండీ(IMD) తీపి కబురు చెప్పింది. ఈ వానాకాలంలో సాధారాణం కన్నా ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముందుగా అనుకున్న దాని కంటే అధికంగా వానలు పడతాయని...

IMD: ఈ వానాకాలంలో వద్దన్నా వానలే.. తెలంగాణలో మాత్రం అప్పటి నుంచే వర్షాలు
rains
Follow us

|

Updated on: Jun 01, 2022 | 7:35 AM

మండే ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన దేశ ప్రజలకు ఐఎండీ(IMD) తీపి కబురు చెప్పింది. ఈ వానాకాలంలో సాధారాణం కన్నా ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముందుగా అనుకున్న దాని కంటే అధికంగా వానలు పడతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. సగటుకు 103 శాతం వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అంతే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల్లో జోరు వర్షాలు కురుస్తాయని వివరించింది. అయితే ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరో వైపు.. నైరుతి రుతుపవనాలు(Monsoon) కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా జూన్‌ ఒకటిన కేరళలో ప్రవేశించే రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే వచ్చేశాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఆదివారమే కేరళ(Kerala) ను తాకినట్లు వెల్లడించింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను కారణంగా రుతు పవనాల కదలికల్లో వేగం పెరిగిందని వివరించింది.

కేరళ నుంచి తమిళనాడు, కర్ణాటక మీదుగా రుతుపవనాలు కదిలి.. అక్కడి నుంచి ఈశాన్య ప్రాంతం వైపు నెమ్మదిగా విస్తృతమయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 8 నాటికి రుతుపవనాలు తెలంగాణకు చేరుతాయని అంచనా వేశారు. ఈ ఏడాది మార్చి నుంచి మే 28 వరకు దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనా, తెలంగాణలో మాత్రం తక్కువగా వర్షాలు కురిసాయి. ఈ పరిస్థితుల్లో రుతుపవనాల ముందస్తు రాకతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతుంటాయని తెలిపింది. తెలంగాణలో రుతుపవనాలు జూన్ 8నాటికి పురోగమిస్తాయని, అప్పటి వరకు ఉష్ణోగ్రత 32 నుంచి 40 డిగ్రీల మధ్య ఉంటుందని వివరించింది. అలాగే హైదారాబాద్‌లోనూ అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..