AP vs TS Water War: ఏపీ, తెలంగాణ మధ్య కొనసాగుతున్న వాటర్ వార్.. కేఆర్ఎంబీ చైర్మన్‌కు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ..

AP vs TS Water War: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాటర్‌ వార్‌ కంటిన్యూ అవుతోంది. తాజాగా, కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు చైర్మన్‌కు మరో లేఖ రాశారు..

AP vs TS Water War: ఏపీ, తెలంగాణ మధ్య కొనసాగుతున్న వాటర్ వార్.. కేఆర్ఎంబీ చైర్మన్‌కు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ..
Ap And Ts
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 01, 2022 | 8:14 AM

AP vs TS Water War: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాటర్‌ వార్‌ కంటిన్యూ అవుతోంది. తాజాగా, కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు చైర్మన్‌కు మరో లేఖ రాశారు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేప‌ట్టిన పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్ ప‌థ‌కాల‌పై ఫిర్యాదు చేశారాయన. ఎలాంటి అనుమ‌తి లేకుండానే కృష్ణా నదిపై ఏపీ పంప్డ్ స్టోరేజ్ ప‌థ‌కాల‌ను చేప‌ట్టింద‌ని అభ్యంత‌రం వ్యక్తం చేశారు మురళీధర్. అనుమ‌తుల్లేని ప్రాజెక్టుల‌ను నిలువ‌రించాల‌ని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేప‌ట్టిన అన్ని పంప్డ్‌ స్టోరేజ్ ప‌థ‌కాల వివ‌రాలు తెప్పించి ఇవ్వాల‌ని బోర్డును కోరారు తెలంగాణ ఈఎన్సీ. క‌ర్నూలు జిల్లా పిన్నాపురం వ‌ద్ద చేప‌ట్టిన గ్రీన్ కో విద్యుత్ ప్రాజెక్టుపై కూడా ఫిర్యాదు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం అనుమ‌తి లేకుండా కృష్ణా జ‌లాల‌ను వినియోగించొద్దని స్పష్టం చేశారు మురళీధర్. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలోని పిన్నాపురం వద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి జగన్ ఇటీవల శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభమైన ఈ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది.

అటు, జూన్‌ 1 నుంచి నీటి సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో, జలవిద్యుదుత్పత్తిపై ఫోకస్‌ పెట్టింది KRMB. జాతీయ సమగ్రత దృష్ట్యా రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంది. తాగు, సాగునీటి అవసరాలకు అనుగుణంగా జల విద్యుదుత్పత్తిపై నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ కోరగా, రెండు రాష్ట్రాలకు అనుకూలంగా రూల్‌ కర్వ్‌ ఉండేలా నిర్ణయించింది. రూల్‌ కర్వ్‌ ముసాయిదాపై ఏపీ అధికారులు కొన్ని వివరణలు అడిగారు. అటు, జల విద్యుదుత్పత్తి, వరద సమయంలో నీటి లెక్కింపుపై కూడా దృష్టిపెట్టింది కృష్ణా నది యాజమాన్య బోర్డు. ఈ వారంలో కమిటీ మరోమారు సమావేశం కానుంది. ఈ సమావేశంలో రూల్‌ కర్వ్‌, జల విద్యుదుత్పత్తి, నీటి విడుదల అంశాలపై నివేదికను కేఆర్‌ఎంబీ, కేంద్ర జలశక్తిశాఖకు సమర్పించనున్నట్లు చెప్పారు బోర్డు అధికారులు.