TSPSC: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే
గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ(TSPSC) గుడ్ న్యూస్ చెప్పింది. వారి విజ్ఞప్తి పేరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అనుమతించింది. ముందుగా.....
గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ(TSPSC) గుడ్ న్యూస్ చెప్పింది. వారి విజ్ఞప్తి పేరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అనుమతించింది. ముందుగా.. మే 31(మంగళవారం) చివరి తేదీగా ప్రకటించారు. అయితే దరఖాస్తులు సమర్పించేందుకు లాస్ట్ డేట్ కావడంతో అభ్యర్థులు పోటెత్తారు. ఆ ఒక్కరోజే సుమారు 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఒకే రోజు ఇంత మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం, ఫీజు చెల్లింపు, సాంకేతిక సమస్యలు, వివిధ కారణాలతో తాము దరఖాస్తు చేసుకోలేకపోయామని కొందరు అభ్యర్ధులు టీఎస్‌పీఎస్సీ దృష్టికి తీసుకువచ్చారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 4 వరకు దరఖాస్తుల సమర్పణకు గడువిచ్చింది.
అయితే.. మంగళవారం రాత్రి పదకొండు గంటల వరకు 3 లక్షల 48వేల దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా 1లక్షా 84వేల 426 ఓటీఆర్‌లు వచ్చాయి. కాగా 503 గ్రూప్1 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్1 దరఖాస్తుకు ముందు టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో నమోదు చేసుకున్నవారు కూడా తమ స్థానికత వివరాలను పొందుపరచవల్సి (ఎడిట్) ఉంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి