Petrol Crisis: లీటర్ పెట్రోల్ కోసం 12 గంటల ఎదురు చూపులు.. ఎక్కడో తెలుసా.
Petrol Crisis: చరిత్రలోనే ఎన్నడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో సామాన్యుల కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి.
Petrol Crisis: చరిత్రలోనే ఎన్నడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో సామాన్యుల కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. రోజు రోజుకీ పెరుగుతున్న ఇంధన ధరలు మోయలేనంత భారంగా మారిపోతున్నాయి. అయినా కొని బతుకీడుద్దామన్నా బంకుల దగ్గర గంటల తరబడి భారీ క్యూలైన్లలో వేచిచూడాల్సి వస్తోంది. పెట్రోలు, డీజిల్ ఎప్పుడొస్తాయో తెలియదు.. వచ్చినా తమ వరకూ అందుతాయన్న గ్యారంటీ కూడా లేదు. ఈ కారణంగా.. శ్రీలంకలో పబ్లిక్ ఇళ్లలో ఉండే సమయం కంటే.. బంకుల ముందే ఎక్కువ టైమ్ ఉంటున్నారు. ఒక్క లీటర్ పెట్రోల్ కోసం గంటలు గంటలు ఎదురు చూడాల్సి వస్తోంది.
శ్రీలంక రాజధాని కొలంబో శివారులోని ఓ బంకు దగ్గర ఈ పెద్ద క్యూలైన్లో ఆటో డ్రైవర్లు గత రాత్రి నుంచి 12 గంటలుగా ఎదురుచూస్తున్నారు. అంతకు ముందు రెండున్న రోజులు ఇలాగే ఎదురు చూడాల్సి వచ్చింది. ఇక గత ఎనిమిది నెలలతో పోలిస్తే ఇంధన ఛార్జీలు రెండున్నర రెట్లు పెరిగిపోయాయి.. ఈ పరిస్థితుల్లో జీవనం సాగించేది ఎలా అని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బంకుల దగ్గర గంటల తరబడి ఇంధనం కోసం ఎదురు చూడటంతోనే సగం దినం గడచిపోతుంటే జీవితం గడవడం కష్టమైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, బియ్యం కొనడమే కష్టంగా ఉందని, ఈ పరిస్థితుల్లో అనారోగ్యానికి గురైతే మందులు కొనడం ఇబ్బందేనని తమ కష్టాలు చెప్పుకొంటున్నారు శ్రీలంక ప్రజలు.