AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lungs Health: ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తుల కోసం ఇలా చేయండి.. ఆ రోగాలన్నీ దరిచేరవు అంతే..

ఊపిరితిత్తులు శరీరమంతటా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. ఆక్సిజన్ సరిగ్గా శరీరానికి చేరకపోతే.. అది కణాలపై ప్రభావం చూపుతుంది.

Lungs Health: ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తుల కోసం ఇలా చేయండి.. ఆ రోగాలన్నీ దరిచేరవు అంతే..
Lungs Health
Shaik Madar Saheb
|

Updated on: Jun 01, 2022 | 2:51 PM

Share

Lungs Health Tips: కరోనావైరస్ మహమ్మారి వల్ల మన శరీరంలో ఎక్కువగా ప్రభావితమయ్యే అవయవం ఊపిరితిత్తులు. కోవిడ్-19 నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేసి దెబ్బతీస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఇది శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కరోనా కేసుల్లో ముఖ్యంగా శ్వాస ఆడకపోవడం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వంటివి కనిపించాయి. అయితే.. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఊపిరితిత్తులను దృఢంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ఊపిరితిత్తులు శరీరమంతటా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. ఆక్సిజన్ సరిగ్గా శరీరానికి చేరకపోతే.. అది కణాలపై ప్రభావం చూపుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామంతో పాటు ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి.

దృఢమైన ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తుల కోసం..

1- ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

2- ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి

3- నూనె, నెయ్యి పదార్థాలు తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

4- గుడ్లు, మీట్ లాంటివి తినాలి.

5- గొంతును ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఇలాంటి వ్యాయామాలు చేయండి..

  • ముందుగా, నిశ్శబ్దంగా, బహిరంగ ప్రదేశంలో కూర్చోండి. మీ కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలి. ఈ క్రమంలో మంచిగా శ్వాస తీసుకోని.. వీలైనంత బిగపట్టి నిదానంగా శ్వాసను వదలండి.
  • రెండవ వ్యాయామం చేస్తున్నప్పుడు.. మీరు ఒక చేతిని మీ కడుపుపై మరొక చేతిని మీ ఛాతీపై ఉంచాలి. ఇప్పుడు గాలి పీల్చుకోండి. ఆ తర్వాత నెమ్మదిగా గాలిని వదులుతూ ఉండండి..
  • ఈ వ్యాయామంలో ఉచ్ఛ్వాసము – నిచ్ఛ్వాసము వ్యవధి ఒకే విధంగా ఉండాలి. అంటే ఊపిరి పీల్చుకునేటప్పుడు 5 వరకు లెక్కించండి.. ఊపిరి వదిలేటప్పుడు 5 వరకు లెక్కించండి. ఈ సమయం ఒకే విధంగా ఉండాలి.
  • వ్యాయామం చేసేటప్పుడు సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి. చాలా తేలికగా శ్వాస తీసుకోని.. వదులుతూ ఉండండి.. ఎక్కువగా సమయం కాకుండా.. 10 నుంచి 20 నిమిషాలపాటు సౌకర్యవంతంగా చేస్తే సరిపోతుంది.
  • ఈ వ్యాయామంలో లోతైన శ్వాస తీసుకోని.. వీలైనంత ఎక్కువసేపు గాలిని అలానే బిగపట్టండి. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాసను వదలండి.. అయితే.. మీరు శ్వాసను ఎంతసేపు బిగపట్టుకోగలరో చూడండి. ఇలా రోజుకు 2-3 సార్లు చేయండి. ప్రతిసారీ 2 నుంచి 3 సెకన్ల వరకు శ్వాసను పట్టుకునే వ్యవధిని పెంచండి. మీరు మీ శ్వాసను 25 సెకన్ల కంటే ఎక్కువసేపు పట్టుకుంటే మీ ఊపిరితిత్తులలో ఎటువంటి సమస్య ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు, సూచనలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. దీనిని టీవీ9 నిర్ధారించలేదు. వీటిని సూచనలుగా మాత్రమే తీసుకోండి. వీటిని అనుసరించే ముందు వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..