Beetroot Benefits: బీట్‌రూట్‌తో బోలెడన్ని ప్రయోజనాలు.. ఇలా ట్రై చేస్తే ఆ సమస్యలన్నీ మటుమాయం..

బీట్‌రూట్ వినియోగం గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్యలో కూడా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.

Beetroot Benefits: బీట్‌రూట్‌తో బోలెడన్ని ప్రయోజనాలు.. ఇలా ట్రై చేస్తే ఆ సమస్యలన్నీ మటుమాయం..
Beetroot
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 01, 2022 | 3:18 PM

Beetroot Health Benefits: బీట్‌రూట్‌లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. బరువు తగ్గడం నుంచి చర్మాన్ని మెరుగుపరచడం వరకు ఇది ఎన్నో రకాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అదేవిధంగా రక్తహీనత సమస్యను దూరం చేయడంలో బీట్‌రూట్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే.. శరీరంలో రక్త లోపం దూరమవుతుంది. ఇది కాకుండా.. బీట్‌రూట్ వినియోగం గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్యలో కూడా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. బీట్‌రూట్ కూలింగ్ ఎఫెక్ట్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని వేసవిలో ముఖ్యంగా తినాలని వైద్యనిపుణులు సూచిస్తారు. బీట్‌రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

చాలా మంది బీట్‌రూట్‌ను సలాడ్ లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటారు. అదే సమయంలో బీట్‌రూట్‌ను పిండిలో సైతం కలిపి రొట్టె కూడా తయారు చేసుకొని తింటారు. ఇంకా పచ్చిగా.. లేదా కూర చేసుకోనైనా తింటారు.

ఖాళీ కడుపుతో జ్యూస్ తాగాలి..

ఇవి కూడా చదవండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బీట్‌రూట్ నుంచి ఎక్కువ ప్రయోజనం పొందాలనుకుంటే దాని జ్యూస్‌ను ఖాళీ కడుపుతో తాగాలి. దీని కోసం బీట్‌రూట్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండర్ జార్‌లో వేయండి. బాగా గ్రైండ్ అయ్యేలా దీనిలో కొద్దిగా నీరు కలపండి. ఇప్పుడు దానిని ఫిల్టర్ చేసి రసాన్ని వేరు చేయండి. అందులో నిమ్మరసం, కొద్దిగా నల్ల ఉప్పు వేసి తాగాలి. దీంతో మలబద్ధకం సమస్య దూరమవుతుంది. రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడొచ్చు. ఇది చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది.

బీట్‌రూట్‌తో రోటీ..

బీట్‌రూట్‌ను ఉపయోగించి రోటి తయారు చేసుకొని తినవచ్చు. ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి.. పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ ముద్దను పిండిలో వేసి బాగా కలిపి రోటీ లేదా పరాటాలు చేసుకుని తినాలి. దీంతోపాటు దోశ పిండిలో కూడా బీట్‌రూట్ పేస్ట్‌ను కలిపి తినవచ్చు.

సలాడ్ గా..

బీట్‌రూట్‌ను సలాడ్ రూపంలో తింటే చాలా మంచిది. ఇందుకోసం ముందుగా బీట్‌రూట్‌ను ఉడికించాలి. ఇప్పుడు దాని పై తొక్క తీసి సలాడ్ లాగా కట్ చేసుకోండి. మీరు దీన్ని నేరుగా లేదా మీకు కావాలంటే శాండ్‌విచ్‌లో కూడా ఉంచి తినవచ్చు.

పొడి చేసుకోని కూడా ఉపయోగించవచ్చు..

బీట్‌రూట్ పొడిని తయారు చేయడం ద్వారా కూడా నిల్వ చేయవచ్చు. ఇందుకోసం ముందుగా బీట్‌రూట్‌ను తురుముకుని, ఎండలో ఉంచండి. అది ఆరిపోయాక మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఆహారంలో పలు రకాలుగా ఉపయోగించవచ్చు. మీకు తాజా బీట్‌రూట్ అందుబాటులో లేకపోతే మీరు దానిని నీటిలో కలుపుకుని తాగవచ్చు. ఇది కాకుండా దీనిని కేక్‌లలో లేదా అనేక ఇతర వస్తువులలో ఫుడ్ కలర్‌గా కూడా ఉపయోగించవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?