Viral Video: వామ్మో.. రెప్పపాటులో మిస్సైంది.. లేదంటే ప్రాణం పోయేది.. వీడియో చూస్తే గుండెల్లో రైళ్లు పరిగెడతాయ్..
ఇద్దరు పిల్లల్లో ఒకరు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. క్షణం ఆలస్యమైనా ఆ చిన్నారి ప్రాణం పోయేంది. ఇది చూసిన నెటిజన్లు భయపడుతున్నారు.
Child Narrowly Escapes Train: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా.. రైలు ప్రమాదం నుంచి ఇద్దరు పిల్లలు తృటిలో తప్పించుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరు పిల్లలు రైలు పట్టాల వెంట నడుస్తుండగా.. రైలు కూడా అదే మార్గంలో వెళుతుంది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల్లో ఒకరు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. క్షణం ఆలస్యమైనా ఆ చిన్నారి ప్రాణం పోయేంది. ఇది చూసిన నెటిజన్లు.. అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు.. లేకపోతే ఘోరాన్ని చూడాల్సి వచ్చేదని.. చూస్తుంటే భయమేస్తుంది అంటూ పేర్కొంటున్నారు. ఈ ఘటన టోరంటో కెనడాలోని టొరంటోలో మే 20న జరిగింది. ఈ వీడియోను కెనడియన్ రవాణా సంస్థ మెట్రోలింక్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
రైలు లోపలి నుంచి తీసిన ఈ వీడియోలో ముగ్గురు పిల్లలు రైల్వే ట్రాక్స్ మీద కనిపిస్తున్నారు. ఒక పిల్లాడు ఒక పక్క నిలబడి ఉండగా.. ఇద్దరు పిల్లలు పట్టాల మధ్యలో పరిగెత్తుతూ కనిపంచారు. వేరు వేరు ట్రాక్‌ల మధ్యలో ఒక పిల్లవాళ్లు ఉండగా.. అకస్మాత్తుగా రైలు వచ్చింది. అదే సమయంలో ఒక పిల్లవాడు అకస్మాత్తుగా రైలు వెళ్లే పట్టాల మీదకు వచ్చేశాడు. ఈ క్రమంలో అతను రైలు కింద పడిపోయినట్లు అనిపిస్తుంది. కానీ.. అదృష్టవశాత్తూ అతను అడుగు దూరం నుంచి తప్పించుకున్నాడు.
వీడియో చూడండి..
⚠️ This heart-stopping video shows the dangers of walking on railways. Watch as young people come within a foot of serious injury or death while trespassing on a rail bridge in Toronto.
Talk to your kids about rail safety. Resources here: https://t.co/X5uS2ewqui #MetrolinxFYI pic.twitter.com/R8P6dmDFdW
— Metrolinx (@Metrolinx) May 30, 2022
కాగా.. ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన మెట్రోలింక్స్ పిల్లలకు రైలు భద్రత గురించి వివరించాలని తల్లిదండ్రులను కోరింది. కాగా.. ఈ వీడియో వైరల్ అవడంతో పలువురు భద్రత గురించి పిల్లలకు చెప్పాలంటూ సూచిస్తున్నారు. అంతేకాకుండా పట్టాలపై వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..