AP: మెరుపులా వచ్చి మాయమవుతున్న పెద్ద పులి.. మరో ఆవుపై పంజా.. వణికిపోతున్న కాకినాడ జిల్లా వాసులు

పులి కనిపిస్తే భయం. కానీ అక్కడ పులి కనిపించక వణికిపోతున్నారు. వారం రోజులుగా అక్కడే తిరుగుతోంది. కానీ జాడ దొరకడం లేదు.

AP: మెరుపులా వచ్చి మాయమవుతున్న పెద్ద పులి.. మరో ఆవుపై పంజా.. వణికిపోతున్న కాకినాడ జిల్లా వాసులు
The Royal Bengal Tiger
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 02, 2022 | 10:29 AM

రక్తం రుచి మరిగిన పెద్ద పులి కాకినాడ(Kakinada) పరిసరాల్లో పంజా విసురుతూనే ఉంది. మెరుపులా వచ్చి మాయమవుతుంది. కానీ ఆ గ్యాప్‌లో పశువులపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసి చంపేస్తోంది. లేటెస్ట్‌గా పాండవులపాలెం(Pandavulapalem)-పొదురుపాక(Podurupaka) సమీపంలో మరో ఆవుపై ఎటాక్‌ చేసింది. పులి పాదముద్రల చూసి ఆందోళన చెందుతున్న జనం.. వరుసగా పశువులపై దాడులతో వణికిపోతున్నారు. ఉదరవాడ మెట్టపై బస చేసిన పెద్దపులి.. రాత్రి సమయంలో ఆహార అన్వేషణకు బయలుదేరుతోంది. ఈ క్రమంలోనే ఆవును చంపి ఆకలి తీర్చుకున్నట్టు తెలుస్తోంది. వారం రోజుల క్రితం ఒమ్మంగిలో ప్రత్యక్షమైన పెద్దపులి పొదురుపాక వైపు వెళ్లినట్టు లేటెస్ట్‌ దాడితో స్పష్టమవుతోంది. రాజవొమ్మంగి వైపు నుంచి విశాఖ(Vizag) వైపు వెళ్తే ప్రత్తిపాడు మండల సమీప ప్రాంత ప్రజలకు గండం గడిచినట్టేనని అధికారులు భావిస్తున్నారు. అయితే పులి ఎప్పుడు ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితి. జనం జర భద్రంగా ఉండాలంటున్నారు ఫారెస్ట్ అధికారులు. ఉదరవాడ మెట్ట మీద బస చేసింది బెంగాల్ రాయల్ టైగరేనని అధికారులు అంచనాకు వచ్చారు. అయితే పెద్దపులి జాడ కనిపెట్టడం బిగ్‌ టాస్క్‌గా మారిపోయింది. నిజానికి పెద్దపులితో ఆట.. వేట రెండూ ప్రమాదమే. దాన్ని పట్టుకోవడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దానికో లెక్క ఉంటది.. అంతకుమించి ప్రొటోకాల్ ఉంటది. మిగిలిన జంతువుల మాదిరి అదిలించి, బెదిరించి బంధించే  అవకాశమే లేదు. ఎందుకంటే పెద్దపులి జాతీయ జంతువు. నేషనల్ టైగర్‌ కన్జర్వేటివ్‌ అథారిటీ రూల్స్‌ని కచ్చితంగా ఫాలో అవ్వాలి. కూల్‌గా డీల్ చేయాలి.

NTCA రూల్స్‌ ప్రకారం పెద్దపులికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బోనులోకి వచ్చేలా చూడాలి. అది కూడా పరిస్థితి చేయి దాటిన సమయంలోనే అలా చేయాల్సి ఉంటుంది.  మత్తు ఇంజక్షన్ ఇచ్చి అత్యంత సురక్షితంగా బంధించాలి. మళ్లీ అది ఉండే ప్రాంతంలోనే వదిలేయాలి. ఒకవేళ పులి దాడి చేసి అడవిలోకి వెళ్లిపోతే దానిని వేటాడడానికి వీల్లేదంటున్నాయి NTCA రూల్స్‌. అందుకే కాకినాడలో పెద్దపులి సంచారంపై అధికారులు చాలా సీరియస్‌గా స్టడీ చేస్తున్నారు. డ్రోన్‌ కెమెరాలతో కూడా సెర్చ్‌ చేసే ధైర్యం చేయడం లేదు.

కాకినాడ జిల్లా మైదాన ప్రాంతం. ప్రతిపాడు మండలంలో పెద్దగా అటవీ ప్రాంతం లేదు. ఒమ్మంగి గ్రామ శివారులో మాత్రం చిన్నపాటి ఫారెస్ట్ ఏరియా ఉంది. దానికి సమీపంలో అడవులేవీ లేవు. మరి పులి ఎక్కడి నుంచి వచ్చిందనేది అంతుచిక్కడం లేదు. లోకల్‌గా పుట్టి పెరిగిందా? లేదంటే రంపచోడవరం ఏజెన్సీ వైపు నుంచి వచ్చిందా? ఒమ్మంగి ప్రాంతానికి రావాలంటే పులి దాదాపు 80 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. మధ్యలో అడవులు పెద్దగాలేవు. హైవేలు, రోడ్లు గ్రామాలు చాలా ఉన్నాయి. ఇటు వంతాడ వైపు నుంచి వచ్చిందనుకున్నా.. దాదాపు అసాధ్యమే. మొత్తానికి పులి ఎక్కడినుంచి వచ్చిందన్నది మిస్టరీగా మారిందనుకుంటే.. దాన్ని పట్టుకోవడం అంతకుమించి ఇబ్బందిగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?