Andhra Pradesh: ‘కులాలను విడదీసే వాడిని కాను.. బీజేపీతో పొత్తులోనే ఉన్నాం’.. పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్

బీజేపీ తో పొత్తు విషయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము బీజేపీతో పొత్తులో ఉన్నామని, ఈ విషయంపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. అంతే కాకుండా కోనసీమ(Konaseema) లో జరిగిన అల్లర్లపై....

Andhra Pradesh: 'కులాలను విడదీసే వాడిని కాను.. బీజేపీతో పొత్తులోనే ఉన్నాం'.. పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్
Pawan Kalyan
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 04, 2022 | 7:24 PM

బీజేపీ తో పొత్తు విషయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము బీజేపీతో పొత్తులో ఉన్నామని, ఈ విషయంపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. అంతే కాకుండా కోనసీమ(Konaseema) లో జరిగిన అల్లర్లపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘర్షణలను కుల ఘర్షణలుగా చిత్రీకరించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. చాలా పకడ్బందీగా ప్లాన్‌ చేసి కోనసీమలో అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. ప్రశాంతమైన పచ్చని సీమలో చిచ్చురేపారని మండి పడ్డారు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్‌ పెట్టి, ఓట్ల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కుల ప్రభావిత పాలిటిక్స్ ను ఆపాలనే ఉద్దేశంతోనే బీజేపీ(BJP), టీడీపీతో కలిశామని వెల్లడించారు. అయితే.. కోనసీమలో అధికార పార్టీ నేతలు సృష్టించిన అల్లర్లు చాలా బాధాకరమని అన్నారు. ఇది బహుజన సిద్ధాంతంపై, బహుజన ఐక్యతపై దాడి చేసినట్లుగా జనసేన భావిస్తోందని చెప్పారు. విజయవాడ(Vijayawada) లో గతంలో జరిగిన ఘటనలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ.. రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు రేపిందన్న విషయాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. సైద్ధాంతిక బలంతో ఉన్న జనసేన పార్టీకి కులాల ఐక్యతే బలమైన సిద్ధాంతం అని స్పష్టం చేశారు. కుల నిర్మూలన కంటే కులాల ఐక్యతే చాలా ముఖ్యమన్న విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నట్లు పవన్ వివరించారు.

కరోనా వచ్చి కొంచెం దూరం పెంచింది. ఇప్పుడు తగ్గింది. టీడీపీ ఒకప్పుడు వన్ సైడ్ లవ్ అంది. ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటున్నారు. రెండిటిలో దేనికి కట్టుబడి ఉంటారో చూద్దాం. జనసేన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది జనసేన బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం, రెండోది జనసేన బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయడం, జనసేన సింగిల్ గా పోటీ చేయడం. పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప. ప్రతిసారి మేమే తగ్గాము. ఈసారి వారు తగ్గితే బాగుంటుంది. బైబిల్ సిద్ధాంతాన్ని టీడీపీ వంట పట్టించుకోవాలి. కులరహిత సమాజం కోరుకునే పార్టీ మాది. జనసేన. సైద్ధాంతిక బలంతో ఉన్న పార్టీ. భారతదేశ రాజకీయాలు కులాలతో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాల్లో గుణం కాదు కులం చూస్తున్నారు. 2014 లో పార్టీ ప్రారంభించినప్పుడు పార్టీ 7 సిద్ధాంతాల్లో ఒకటి కులాల ఐక్యత. కుల నిర్మూలన జరగాలని అంబేడ్కర్‌ ప్రతిపాదించారు. ఫేక్‌ ప్రపంచంలో బతుకుతున్నాం. అవినీతి సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చిన వారు ఏసీబీని కంట్రోల్‌ చేస్తున్నారు. అవినీతి, దాడులు చేసే వారి పాలనలో మనం బతకాలి. ఈ దేశ పౌరుడిగా ఇది నాకు ఇబ్బంది.

      – పవన్‌ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా అరికడతామని చెప్పి, ఉన్న ఇసుకనంతా ఓ కంపెనీకి కట్టబెట్టారని పవన్ ఆక్షేపించారు. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి, అక్రమార్జనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎలాంటి ప్రమేయం లేని జనసేన పార్టీ నేతలపై ఆరోపణలు చేశారని విమర్శించారు. ఒక్కమాట అనకపోయినా జనసేన కార్యకర్తలపై దాడి చేశారని అన్నారు. కోనసీమ అల్లర్లతో జనసేనకు నష్టం జరుగుతుందని భావించారన్న పవన్.. అది మీ తెలివితక్కువ తనమే అవుతుందని ఎద్దేవా చేశారు. తాను కులాలను కలిపేవాడినే గానీ.. విడదీసే వాడిని కానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

మరో వైపు వైసీపీ(వైకాపా)కు సరికొత్త నిర్వచనం చెప్పారు పవన్ కల్యాణ్. వైకాపా అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. కానీ, వైసీపీ పాలనలో శ్రామికులకు పనిలేదు. యువజనులకు ఉద్యోగాలు లేవు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఇదీ ప్రస్తుతం వైకాపా అంటే నిర్వచనమని వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి