Andhra Pradesh: అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకుంటున్నారు.. సీఎం జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్
పదో తరగతి పరీక్షా ఫలితాలను చివరి క్షణంలో వాయిదా వేయడంపై టీడీపీ లీడర్ అచ్చెన్నాయుడు(Achennaidu) ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. కోర్టు వాయిదాలకు అలవాటుపడ్డారని, అదే విధంగా పదో తరగతి...
పదో తరగతి పరీక్షా ఫలితాలను చివరి క్షణంలో వాయిదా వేయడంపై టీడీపీ లీడర్ అచ్చెన్నాయుడు(Achennaidu) ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. కోర్టు వాయిదాలకు అలవాటుపడ్డారని, అదే విధంగా పదో తరగతి ఫలితాలను(Tenth Class Results in AP) కూడా వాయిదా వేస్తారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు విడుదల చేసే ముందు చివరి నిమిషంలో ఎందుకు వాయిదా వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్(CM Jagan) అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆక్షేపించారు. వైసీపీ పాలనలో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం జగన్ చేసింది శూన్యమని అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా.. ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు చివరి నిమిషంలో ప్రకటించారు. పరీక్షా ఫలితాలను సోమవారం (జూన్6) రోజున విడుదల చేయనున్నట్లు తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. సోమవారం ఫలితాలను విడుదల చేయనున్నామని ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు, తల్లిదండ్రులు గమనించాలని గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి