AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. మార్చి 15 నుంచే అమలు..

ఇప్పటివరకు వాహన రిజిస్ట్రేషన్ అంటేనే ఆర్టీఏ ఆఫీసులు, ఫైళ్లు, కొర్రీలు, ఏజెంట్ల చుట్టూ ప్రదక్షిణలు గుర్తొచ్చేవి. కానీ ఇకపై ఆ టెన్షన్లన్నీ గతం కానున్నాయి. రవాణా సేవలను అరచేతిలోకి తెస్తూ తెలంగాణ ప్రభుత్వం వాహన్ పోర్టల్‌తో జతకట్టనుంది. మార్చి 15 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త వ్యవస్థతో పనులన్నీ చిటికలో పూర్తయిపోతాయి.

Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. మార్చి 15 నుంచే అమలు..
Telangana Joins Vahan Portal
Krishna S
|

Updated on: Feb 07, 2026 | 10:04 AM

Share

తెలంగాణ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పు రాబోతోంది. ఇప్పటివరకు సొంత ఐటీ వ్యవస్థతో నెట్టుకొచ్చిన తెలంగాణ రవాణా శాఖ, ఇప్పుడు జాతీయ నెట్‌వర్క్‌లో భాగం కానుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే లైసెన్సుల కోసం సారథిని ప్రవేశపెట్టగా.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల కోసం వాహన్ పోర్టల్‌ను అనుసంధానిస్తోంది. దీనివల్ల వన్ నేషన్ – వన్ రిజిస్ట్రీ కల సాకారం కానుంది. అటు వాహనదారులకు దశాబ్దాల నాటి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాలు దాటి వాహనాలు కొనుగోలు చేసేవారికి ఇది అతిపెద్ద ఊరట. గతంలో ఇతర రాష్ట్రాల నుండి వాహనం తెచ్చుకున్నా లేదా ఇక్కడి వాహనాన్ని వేరే రాష్ట్రానికి తీసుకెళ్లాలన్నా NOC కోసం ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై డేటా అంతా కేంద్ర సర్వర్‌లో ఉండటం వల్ల ఈ ప్రక్రియ సెకన్ల వ్యవధిలో ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది.

సెకండ్ హ్యాండ్ వెహికిల్స్ కొనేవారికి రక్షణ

మీరు సెకండ్ హ్యాండ్ వాహనం కొంటున్నారా? అయితే ఈ మార్పు మీకోసమే. వాహనంపై ఎన్ని చలాన్లు ఉన్నాయి..? గతంలో ఏవైనా క్రైమ్ రికార్డులు ఉన్నాయా..? అనేది సులభంగా తెలుసుకోవచ్చు. ఇంజిన్, ఛాసిస్ నంబర్లను నేరుగా పోర్టల్‌లో సరిచూసుకోవచ్చు. తద్వారా మోసాలకు అడ్డుకట్ట పడుతుంది.

ఇంటి నుండే ఆర్టీఏ సేవలు

ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్ల బెడద, క్యూ లైన్ల ఇబ్బంది ఇక ఉండదు. డూప్లికేట్ ఆర్సీ, అడ్రస్ మార్పు, హైపోథికేషన్ రద్దు వంటి పనులను నేరుగా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు.ఫిజికల్ డాక్యుమెంట్లు వెంట ఉంచుకోక్కర్లేదు. డిజీ లాకర్ లేదా ఎం-పరివాహన్ యాప్‌లోని డిజిటల్ ఆర్సీ చెల్లుబాటు అవుతుంది.

నేర నియంత్రణలో కీలక పాత్ర

వాహన దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఈ పోర్టల్ పోలీసులకు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. తెలంగాణలో దొంగిలించిన వాహనాన్ని ఇతర రాష్ట్రాల్లో విక్రయించడానికి ప్రయత్నిస్తే.. జాతీయ నెట్‌వర్క్ వల్ల ఆ వాహన గుర్తింపు వెంటనే తెలిసిపోతుంది.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?