AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా.. అసలేం జరిగిందంటే..?

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఒక ఘటన మరువక ముందే మరో చిన్నారి రక్తం వీధుల పాలవుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో ఐదేళ్ల బాలుడిపై ఐదు కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అసలేం జరిగిందంటే..?

Telangana: అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా.. అసలేం జరిగిందంటే..?
Stray Dog Attacks In Sangareddy
P Shivteja
| Edited By: |

Updated on: Feb 07, 2026 | 10:42 AM

Share

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కలు మృగాల్లా మారుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట అమాయక చిన్నారులే లక్ష్యంగా దాడులు చేస్తూ రక్తం చిందిస్తున్నాయి. ఒక ఘటన మరవకముందే మరో ఘోరం వెలుగుచూస్తుండటంతో అటు తల్లిదండ్రులు, ఇటు స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం చిన్నారుల పాలిట శాపంగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు శివపై ఐదు వీధి కుక్కలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఆ చిన్నారిని చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచాయి. బాలుడి ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమికొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

కుక్కల దాడిలో తీవ్ర రక్తగాయాలైన శివను పఠాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు సమయానికి అక్కడ లేకపోయి ఉంటే బాలుడి ప్రాణానికే ప్రమాదం వాటిల్లేదని తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేశారు. కాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కుక్క దాడి ఘటనలు ఎక్కువయ్యాయి. రోడ్ల మీద నడవాలన్నా, పిల్లలను బయటకి పంపాలన్నా జనం వణికిపోతున్నారు. అధికారులు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, కుక్కల నియంత్రణకు చర్యలు శూన్యమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి..

తులసి మొక్కకు ఎరుపు దారం కడితే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా?
తులసి మొక్కకు ఎరుపు దారం కడితే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా?
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..