గాజు బాటిల్లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
చాలా మంది తమకు ఇష్ట మైన దేవుళ్ళ మీద భక్తిని రక రకాలుగా చూపిస్తుంటారు. ఇక ఇతను అయితే, ఏకంగా గాజు బాటిల్ లోపల తిరుమల ఆలయ గోపురాన్ని తయారుచేసి అమర్చాడు. ఇది వీడియోలో నుంచి చూస్తేనే అద్భుతంగా ఉంది. ఇక దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత బావుంటుందో కదా..
మధ్యప్రదేశ్ కు చెందిన ఒక భక్తుడు తన అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు గాజు గ్లాసులో గోపురాన్ని ఆవిష్కరించాడు. గాజు బాటిల్ లో చేతి వేలు కూడా పట్టని పరిస్థితుల్లో ఏకంగా శ్రీవారి ఆలయ గోపురం నమూనా ను అందులో అమర్చాడు. గాజు గ్లాసు లోపల భాగంలో కళాఖండాన్ని ఏర్పాటు చేశాడు. మధ్యప్రదేశ్ కు చెందిన త్రిలోక్ సిందియా అనే భక్తుడు శ్రీవారి ఆలయం ముందు ప్రదర్శించాడు.
చిన్నపాటి చెక్క ముక్కలతో గాజు బాటిల్ లోపల తిరుమల ఆలయ గోపురాన్ని తయారుచేసి అమర్చాడు. తిరుమల వెంకన్న పై తనకున్న ఇష్టం భక్తి ని ఇలా చాటుకున్నాడు. అందరిని ఆకట్టుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చిన త్రిలోక్ సిందియా తాను రూపొందించిన శ్రీవారి ఆలయ గోపురం ఉన్న సీసాను మీడియా ముందు కనబరిచాడు.
దాదాపు 30 రోజుల పాటు కష్టపడి చెక్క ముక్కలను బాటిల్ లోపలికి పంపి ఆ తర్వాత ఒక స్టిక్ ద్వారా ఫెవికాల్ తో గోపురాన్ని తయారుచేశాడు. ఇలా శ్రీవారి ఆలయ గోపుర నమూనాను నిర్మించిన త్రిలోక్ సిందియా పలు ఆలయాల కళాకృతులను కూడా తయారు చేశాడు. అయోధ్య రామ మందిరం ఇండియా గేట్ తో పాటు ఎర్రకోట లాంటి కళాఖండాలను తన ప్రతిభతో తయారు చేసినట్లు తెలిపాడు.
