AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్ స్పెషల్ :నోట్లో వేసుకోగానే కరిగిపోయే పెరుగు వడలు.. ఎలా చేయాలంటే?

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది శరీరానికి చలువ చేసే ఆహారాలు తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా సమ్మర్‌లో పెరుగు తినడం వలన ఇది శరీరానికి చలువ చేయడమే కాకుండా దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొంత మంది పెరుగు తినడానికి అస్సలే ఇష్టపడరు. కానీ పెరుగుతో ఈ వంటకం చేసి పెడితే, పెరుగు ఇష్టం లేని వారు కూడా పెరుగు తింటారంట. ఇంతకీ ఆ వంటకం ఏమిటి అనుకుంటున్నారా? పెరుగు వడలు. దీనిని సులభంగా ఇంటిలోనే ఎలా చేయాలో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Apr 30, 2026 | 1:09 PM

Share
టేస్టీ టేస్టీ పెరుగు వడలు ఇంటిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఆహారపదార్థాల్లోకి వెళితే.. గడ్డ పెరుగు రెండు నుంచి మూడు కప్పులు,  మినపప్పు, ఉప్పు, పచ్చి మిర్చి, అల్లం రెబ్బలు, నూనె, క్యారట్ తురుము, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండు మిర్చి.

1 / 5
 ఇప్పుడు వడలు తయారు చేసుకోవాలి. పెరుగు వడల కోసం కప్పు మినపప్పు తీసుకోవాలి. దీనిని తయారీకి నాలుగు గంటల మందు నానబెట్టుకోవాలి. తర్వాత వీటిలో అల్లం వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి, ఉప్పు, పచ్చి మిర్చి,  కొంచెం కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో వడలు వేయించుకోవడానికి సరిపడ నూనె వేయాలి. ఇప్పుడు వడలను తయారు చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం వడలు చేసుకోవాలి. వడలు మంచిగా కాలే విధంగా, బంగారు రంగు వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు పెరుగు మిశ్రమం తయారు చేసుకోవాలి. దీని కోసం పెరుగును ఒక బౌల్‌లో తీసుకోవాలి. దానిని చిక్కగా తయారు చేసుకోవాలి కొన్ని నీళ్లు పోస్తూ, తర్వాత కొంచెం నూనె పోసి అందులో ఆవాలు, ఎండు మిర్చీ కొత్తిమీర వేసి తాళింపు పెట్టుకొని ఆ తాళింపు పెరుగు మిశ్రమంలో వేయాలి. తర్వాత అందులో వడలు వేసి దాదాపు 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పెరుగు వడ రెడీ.

4 / 5
ఈ పెరుగు వడలు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. అంతే కాకుండా వీటిని తినడం వలన ఇది డీ హైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

5 / 5
Follow Us