AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ కోసం యుద్ధం.. టాలీవుడ్‌లో నయా ట్రెండ్..!

ప్రేమ కోసం యుద్ధం.. టాలీవుడ్‌లో నయా ట్రెండ్..!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 07, 2026 | 7:13 PM

Share

తెలుగు సినిమాల్లో ప్రేమకథల రూపం మారుతోంది. ఒకప్పుడు క్లాస్, ఫీల్‌గుడ్ లవ్ స్టోరీలు ఎక్కువగా కనిపించగా, ఇప్పుడు ప్రేమకు యాక్షన్, యుద్ధం, ప్రతీకారం వంటి అంశాలు జత అవుతున్నాయి. అఖిల్ ‘లెనిన్’, ప్రభాస్ ‘ఫౌజీ’, విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’, ‘శ్రీనివాస మంగాపురం’ వంటి చిత్రాలు ఈ కొత్త ట్రెండ్‌కు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రేమ కోసం పోరాటమే ప్రధాన కథాంశంగా మారుతోంది.

లవ్ స్టోరీస్ అంటే హాయిగా అలా క్లాస్‌గా సాగిపోయేలా ఉంటాయి అనుకుంటారు.. మ్యాగ్జిమమ్ అలాంటి కథలే ఎక్కువగా వస్తుంటాయి కూడా. కానీ తెలుగులో సీన్ మారిపోతుందిప్పుడు. ప్రేమకు యుద్ధాన్ని జత చేస్తున్నారు మేకర్స్. లవ్ స్టోరీలో విజయం కోసం వార్ చేయాల్సిందే అంటున్నారు. అలాంటి వయొలెంట్ లవ్ స్టోరీస్ మన దగ్గర ఎక్కువగా వస్తున్నాయిప్పుడు. మరి అవేంటో చూద్దామా..? ప్రేమ కంటే పెద్ద యుద్ధమే లేదు.. అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా లైన్ ఇదే. ఈ కాన్సెప్ట్‌తోనే సినిమా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి. కెరీర్‌లో హెలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి ప్రేమకథలు చేసినా.. ఈసారి మాత్రం అఖిల్ చాలా వయొలెంట్‌గా కనిపిస్తున్నారు. సీమ నేలపై ప్రేమ కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు అక్కినేని వారసుడు. లెనిన్ టీజర్, సాంగ్స్ అన్నీ సినిమా ఎలా ఉండబోతుందో చెప్తున్నాయి. కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ కోసం వేచి చూస్తున్న అఖిల్.. లెనిన్‌తో ఆ లోటు తీరిపోతుందని బలంగా నమ్ముతున్నారు. జూన్ 26న లెనిన్ విడుదల కానుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. అలాగే తిరుపతి నేపథ్యంలోనే వస్తున్న మరో యాక్షన్ లవ్ స్టోరీ శ్రీనివాస మంగాపురం. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ఈ మాస్ ప్రేమకథలో బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మోహన్ బాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులోనూ యాక్షన్ డోస్ ఎక్కువగానే కనిపిస్తుంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి శ్రీనివాస మంగాపురం తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీలోనూ ప్రేమకథే ఉంది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వస్తుంది ఈ సినిమా. ఇందులో సైనికుడిగా నటిస్తున్నారు రెబల్ స్టార్. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన సైతం మాస్ యాక్షన్ లవ్ స్టోరీగానే వస్తుంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్. మొన్నొచ్చిన అడివి శేష్ డెకాయిట్ కూడా పూర్తిగా యాక్షన్ డోస్ ఉన్న లవ్ స్టోరీనే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీటి చుక్క దొరక్క ఎడారిలో 49 మంది మృతి

అండమాన్‌లో మరో భారీ గ్యాస్ నిక్షేపం.. భారత్ ఇంధన భవిష్యత్తుకు కొత్త ఆశలు

Yash: ముంబై బీచ్‌లో రూ. 24 కోట్ల ప్రాపర్టీ కొన్న యశ్!

బంగారం పెట్టుబడిదారులకు బిగ్ షాక్.. గోల్డ్ ఫండ్స్‌పై కొత్త రూల్స్..!

‘ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు’

Follow Us