AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా..?

మనం తీసుకునే ఆహారం, పానీయాలు మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా రోజును ప్రారంభించేటప్పుడు తీసుకునే డ్రింక్ మన జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా రోజంతా మనల్ని శక్తివంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో పసుపు, నల్ల మిరియాలు కలిపిన నీటిని తాగడం ఆరోగ్యానికి ఒక వరం లాంటిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Krishna S
|

Updated on: Jun 08, 2026 | 6:59 AM

Share
పసుపు, నల్ల మిరియాల నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. వాతావరణ కాలుష్యం, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీస్తాయి. ఈ డ్రింక్‌లోని సమ్మేళనాలు ఆ ఫ్రీ రాడికల్స్‌ను సమర్థవంతంగా తటస్థీకరిస్తాయి. తద్వారా వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేయడంతో పాటు, కేన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి కణాలను రక్షించడంలో అద్భుతంగా సహాయపడతాయి.

1 / 5
పసుపులో ఉండే కర్కుమిన్, నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ అనే సమ్మేళనాలు శక్తివంతమైన సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. సాధారణంగా పసుపులోని కర్కుమిన్‌ను శరీరం అంత త్వరగా గ్రహించలేదు.. కానీ నల్ల మిరియాలలోని పైపెరిన్ దీని శోషణ సామర్థ్యాన్ని ఏకంగా 2000శాతం పెంచుతుంది. ఈ రెండు కలిసి శరీరంలో దీర్ఘకాలిక వాపుకు కారణమయ్యే కారకాలను నిరోధిస్తాయి. ఫలితంగా కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు, అంతర్గత వాపుల నుండి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది.

2 / 5
జీర్ణక్రియను మెరుగుపరచడంలో పచ్చి పసుపు ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. మీరు ఉదయాన్నే పచ్చి పసుపు, మిరియాలు కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నయమవుతాయి. ఇది కాలేయం పనితీరును మెరుగుపరిచి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పేగు ఆరోగ్యానికి కూడా ఈ డ్రింక్ ఎంతో మేలు చేస్తుంది.

3 / 5
పసుపులోని కర్కుమిన్ మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మెదడులో ఉత్పన్నమయ్యే న్యూరోట్రోఫిన్ అనే హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. ఈ ప్రోటీన్ మెదడులో కొత్త నాడీ కణాలు, కనెక్షన్లను ఏర్పరచడంలో సహాయపడుతుంది. తద్వారా వయస్సు పెరగడం వల్ల వచ్చే అల్జీమర్స్, మతిమరుపు వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ డ్రింక్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతాయి.

4 / 5
మంచి రోజును ప్రారంభించడానికి, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవడానికి పసుపు - నల్ల మిరియాల నీరు ఒక పరిపూర్ణమైన హెల్త్ డ్రింక్. అయితే, గర్భిణీ స్త్రీలు లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మందులు వాడుతున్న వారు, ఈ కొత్త ఆహారపు అలవాటును ప్రారంభించే ముందు ఒకసారి ఆరోగ్య నిపుణులను లేదా వైద్యులను సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.

5 / 5
Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..

వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్

చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే

రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..

ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!

రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!

లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!

100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్