AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొన్ని ఇళ్లలోనే టీ ఎందుకు అంత రుచిగా ఉంటుందో తెలుసా? పర్‌ఫెక్ట్‌ టీ తయారీ సీక్రెట్స్‌ మీ కోసమే..

భారతదేశంలో ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పుతో రోజును ప్రారంభించడం చాలామందికి ఒక అలవాటు. అయితే, టీ తయారు చేయడానికి అందరూ వాడే పాలు, నీళ్లు, టీపొడి, చక్కెర, అల్లం, యాలకులు ఒకటే అయినప్పటికీ.. అందరి చేతి టీ ఒకే రుచిని ఇవ్వదు. కొన్ని ఇళ్లలో లేదా బయట హోటల్స్, టప్రీలలో తాగే టీ ఎంతో రుచిగా, కడక్‌గా అనిపిస్తుంది. మరికొన్ని చోట్ల టీ నీళ్లలా లేదా చప్పగా ఉంటుంది. కొన్ని ఇళ్లలో టీ అంత రుచిగా ఉండటం వెనుక ఉన్న ఆ సీక్రెట్ ట్రిక్స్ మరియు తయారీ విధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కొన్ని ఇళ్లలోనే టీ ఎందుకు అంత రుచిగా ఉంటుందో తెలుసా? పర్‌ఫెక్ట్‌ టీ తయారీ సీక్రెట్స్‌ మీ కోసమే..
Kadak Chai Recipe
Jyothi Gadda
|

Updated on: Jun 08, 2026 | 8:30 AM

Share

టీ తయారీకి అందరూ ఒకే రకమైన పదార్థాలను ఉపయోగించినప్పటికీ, అందరి చేతి టీ ఒకే రుచిని ఇవ్వదు. కొన్ని ఇళ్లలో టీ చాలా అద్భుతంగా, కడక్‌గా ఉండటం వెనుక కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు దాగి ఉన్నాయి. నీళ్లు, టీపొడి, పాలు, చక్కెరలను సరైన క్రమంలో, ఖచ్చితమైన కొలతలతో, సరైన సమయంలో వేయడమే ఈ రుచికి అసలైన రహస్యం. అదేలాగో తెలుసుకుందాం..

చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే, గిన్నెలో పాలు, నీళ్లు, టీపొడి, చక్కెర అన్నీ ఒకేసారి వేసి పొయ్యి మీద పెడతారు. ఇలా చేయడం వల్ల టీకి అసలైన ఫ్లేవర్ రాదు. పర్‌ఫెక్ట్ టీ కావాలంటే ముందుగా నీటిని మాత్రమే గిన్నెలో పోసి బాగా మరిగించాలి. నీళ్లు బాగా తెర్లుతున్న సమయంలోనే దంచిన అల్లం లేదా యాలకులను వేయాలి. దీనివల్ల వాటిలోని రసం, సువాసన నీటిలో బాగా కలుస్తాయి. పాలు పోయడానికి కనీసం రెండు నిమిషాల ముందే వీటిని వేసి మరిగించాలి. అయితే అల్లం ముక్కలను మరీ ఎక్కువ సేపు మరిగిస్తే టీ కసరు ఎక్కే ప్రమాదం ఉంది.

నీళ్లు మరుగుతున్నప్పుడు టీపొడి వేసి మీడియం ఫ్లేమ్‌పై 3 నుండి 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. దీనివల్లనే టీకి మంచి రంగు, చిక్కదనం, డికాషన్ ఫ్లేవర్ వస్తాయి. ఆ తర్వాతే పాలు పోయాలి. టీ రుచిగా ఉండటంలో పాలు, నీళ్ల నిష్పత్తి చాలా ముఖ్యం. మరీ ఎక్కువ నీళ్లు పోస్తే టీ పల్చగా మారుతుంది, అదే ఎక్కువ పాలు పోస్తే టీ హెవీగా అనిపిస్తుంది. కాబట్టి, సమాన కొలతలతో తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

టీ తయారీలో మరోక ముఖ్యమైన సీక్రెట్ ఏంటంటే.. చక్కెరను మొదట్లోనే వేసేస్తే అది కరిగి నీటి సాంద్రతను మార్చేస్తుంది. దీనివల్ల టీపొడి సరిగ్గా ఉడకదు. అందుకే పాలు పోసి, టీ బాగా మరిగిన తర్వాత.. దించే ముందు చివరగా చక్కెర వేసి కేవలం ఒక నిమిషం పాటు మరిగించి దించేయాలి.

హోటల్ స్టైల్ టీ రుచి రావాలంటే, టీ మరుగుతున్నప్పుడు గరిటెతో పైకి, కిందికి బాగా తిప్పుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పాలు, డికాషన్ బాగా కలిసి టీ మరింత చిక్కగా, నురగతో ఎంతో రుచిగా తయారవుతుంది. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మీ ఇంట్లో చేసే టీ కూడా ప్రతిరోజూ అద్భుతమైన రుచితో నోరూరిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు
నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి
నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు