AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీక్వెల్ బిజినెస్.. బ్రాండ్‌తోనే పనైపోతుందా..?

సీక్వెల్ బిజినెస్.. బ్రాండ్‌తోనే పనైపోతుందా..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 07, 2026 | 7:17 PM

Share

టాలీవుడ్‌లో ప్రస్తుతం సీక్వెల్స్ హవా కొనసాగుతోంది. ‘కల్కి 2’, ‘సలార్ 2’, ‘దేవర 2’, ‘ఓజీ 2’, ‘జై హనుమాన్’, ‘మిరాయ్ 2’ వంటి చిత్రాలు భారీ అంచనాలతో సిద్ధమవుతున్నాయి. రాబోయే మూడేళ్లలో విడుదలయ్యే ఈ ఫ్రాంచైజీ సినిమాల మొత్తం వ్యాపార విలువ దాదాపు రూ.5,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే అన్ని సీక్వెల్స్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటాయా అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.

సీక్వెల్స్‌తోనే వేల కోట్ల బిజినెస్ అవుతుందా..? కొనసాగింపు కథలు చేయడం నిర్మాతలకు లాభమా నష్టమా..? బ్రాండ్‌తోనే బిజినెస్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా..? ఒకటి రెండు కాదు.. టాలీవుడ్ రాబోయే మూడేళ్లలో దాదాపు అరడజన్‌కు పైగా సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. వీటి బిజినెస్ రేంజ్ అంతా లెక్కేస్తే దాదాపు 5 వేల కోట్లు ఉంటుందని అంచనా. కానీ ఇక్కడే చిన్న చిక్కొచ్చి పడింది. అదేంటో ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.. నీ టైమ్ నడుస్తుందిరా బాబూ అంటారు కదా.. అలా టాలీవుడ్‌లో సీక్వెల్స్ టైమ్ నడుస్తుందిప్పుడు. ప్రతీ కథకు కొనసాగింపు రాయడం అనేది కామన్ అయిపోయిందిప్పుడు. అఖండ 2 అంచనాలు తప్పినా.. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు సీక్వెల్స్‌తో సిద్ధంగా ఉన్నాయి. అందులో ప్రభాస్, తేజ సజ్జా, పవన్ కళ్యాణ్ సినిమాలే రెండున్నాయి. కల్కి 2 సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది.. మరోవైపు సలార్ 2 కూడా డ్రాగన్ తర్వాత మొదలుపెడతానని చెప్పారు నీల్. 2027లో సెట్స్‌పైకి తెచ్చి.. 2028 సమ్మర్‌కు సలార్ 2 ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఇక దేవర 2 సినిమా ఉంటుందని మేకర్స్ చెప్తున్నా.. వచ్చేవరకు అనుమానమే. కొరటాల కూడా బాలయ్య సినిమాకు మూవ్ ఆన్ అయ్యారు. ఇక OG 2 ఉన్నా.. పూర్తిగా పవన్ డేట్స్‌పై ఆధారపడి ఉంటుంది. హరిహర వీరమల్లు 2 మొత్తానికే ఉండకపోవచ్చు.. కానీ ఓజి 2 కోసం సుజీత్ కథ సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సెట్స్‌పైకి వచ్చింది. మరోవైపు మిరాయ్ 2 షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. ఇందులో రానా విలన్‌గా నటిస్తున్నారు.. తేజ ఖాతాలో జాంబి రెడ్డి 2 కూడా ఉంది. యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ సినిమాను స్పిరిట్ తర్వాత చూద్దామంటున్నారు సందీప్ రెడ్డి వంగా. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సీక్వెల్స్ అన్నీ ఇప్పుడో అప్పుడో వస్తాయనే నమ్మకం ఉంది.. కానీ పుష్ప 3, కేజియఫ్ 3 మాత్రం అసలు వస్తాయా అనే డౌట్ ఫ్యాన్స్‌లోనూ ఉంది. 2027లో పుష్ప 3 మొదలుపెడతానంటూ కన్ఫర్మ్ చేసారు సుకుమార్.. మరోవైపు కేజియఫ్ 3ని వదిలేసి టాక్సిక్, రామాయణపై ఫోకస్ చేసారు యశ్. మొత్తానికి ఈ సీక్వెల్స్ బిజినెస్ రేంజ్ 5 వేల కోట్ల వరకు ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీటి చుక్క దొరక్క ఎడారిలో 49 మంది మృతి

అండమాన్‌లో మరో భారీ గ్యాస్ నిక్షేపం.. భారత్ ఇంధన భవిష్యత్తుకు కొత్త ఆశలు

Yash: ముంబై బీచ్‌లో రూ. 24 కోట్ల ప్రాపర్టీ కొన్న యశ్!

బంగారం పెట్టుబడిదారులకు బిగ్ షాక్.. గోల్డ్ ఫండ్స్‌పై కొత్త రూల్స్..!

‘ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు’

Follow Us