ఇంటి అందాన్ని, హుందాతనాన్ని పెంచడానికి ఇండోర్ మొక్కలను పెంచడం ఇప్పుడు సర్వసాధారణం అయింది. ఇంట్లో పెంచే రకరకాల మొక్కలలో మనీ ప్లాంట్‌లకు ఎప్పుడూ అత్యధిక డిమాండ్ ఉంటుంది.
అయితే ఇక్కడ చాలా మందిలో కొన్ని సందేహాలు ఉన్నాయి. మనీ ప్లాంట్‌ను వంటగదిలో ఉంచొచ్చా లేదా అని. అయితే దీన్ని వంటగదిలో ఉంచడం మంచిదే.
ఎందుకంటే వంట చేసేటప్పుడు వెలువడే పొగ, నూనె జిడ్డు, కార్బన్ మోనాక్సైడ్ వంటి విషపదార్థాలను గ్రహించి ఇది గాలిని శుద్ధి చేస్తుంది.
సాధారణంగా ఇంటి ఆగ్నేయ దిశలో వంటగది ఉంటుంది. అక్కడ మనీ ప్లాంట్‌ను ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు.
వంటగదిలోని వేడి, హడావుడి మధ్య పచ్చని మొక్కను చూడటం వల్ల వంట చేసే వారి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
మనీ ప్లాంట్ పెరగడానికి ఎక్కువ సూర్యరశ్మి అవసరం లేదు, అందుకే దీనిని వంటగది లోపల సులభంగా పెంచవచ్చు.
కిచెన్‌లో ఈ మొక్కను ఉంచడం వల్ల అటు ఆరోగ్యపరంగా, ఇటు వాస్తు పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
మొత్తానికి వంటగది వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చడంలో మనీ ప్లాంట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.