నేడు ఇండియా జనబంధన్ అత్యవసర భేటీ.. వ్యూహాలకు పదును పెడుతున్న 23 ప్రతిపక్ష పార్టీలు! వన్-టు-వన్ ఫార్ములాతో ..
దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమి నేడు అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించనుంది. దేశంలో మున్ముందు రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 2029 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై వ్యూహాలను సిద్ధం చేయడానికి ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరగనున్న ఈ ఇండియా జనబంధన్ సమావేశానికి మొత్తం 23 ప్రతిపక్ష పార్టీలు హాజరవుతున్నట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది.

దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమి నేడు అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించనుంది. దేశంలో మున్ముందు రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 2029 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై వ్యూహాలను సిద్ధం చేయడానికి ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరగనున్న ఈ ఇండియా జనబంధన్ సమావేశానికి మొత్తం 23 ప్రతిపక్ష పార్టీలు హాజరవుతున్నట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది.
ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేలతో పాటు పలు లెఫ్ట్ పార్టీలు, చిన్న పార్టీల నేతలు పాల్గొననున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రాంతీయ పార్టీలైన టీఎంసీ (పశ్చిమ బెంగాల్), డీఎంకే (తమిళనాడు) పరాజయం పాలవడంతో కూటమిలో సమీకరణాలు మారాయి. ముఖ్యంగా బెంగాల్‌లో తమ నేతలపై జరుగుతున్న దాడుల అంశాన్ని టీఎంసీ ఇక్కడ లేవనెత్తనుంది. అలాగే కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ వచ్చిన ఆరోపణలపై సీపీఐ(ఎం) పార్టీ కాంగ్రెస్ నాయకత్వాన్ని వివరణ కోరనుంది.
కూటమిలో భిన్నత్వంలో ఏకత్వం ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పేర్కొన్నప్పటికీ, కొన్ని కీలక పార్టీలు ఈ భేటీకి దూరం కావడం గమనార్హం. ఈ ప్రతిపక్షాల ఐక్యతా రాగానికి గండి కొడుతూ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ టీవీకే (TVK) ప్రభుత్వంలో చేరడంతో డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించింది. అయితే నిన్ననే మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు కేజ్రీవాల్‌తో ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపినట్టుగా సమాచారం. కొన్ని పార్టీలు వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నప్పటికీ, మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశాయి.
23 political parties have confirmed participation in the INDIA janbandhan meeting at Constitution Club, New Delhi on Monday June 8, 2026, at 12 noon. There are some parties who have expressed their inability to attend this particular meeting for their own reasons – even though…
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 7, 2026
ఈ ప్రతిపక్షాల భేటీపై అధికార బీజేపీ తీవ్రంగా మండిపడింది. కూటమిలోని అంతర్గత లేఖలను ప్రస్తావిస్తూ బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమికి ఎలాంటి మిషన్ (లక్ష్యం), విజన్ లేవని వారిలో ఉన్నదల్లా కేవలం కన్ఫ్యూజన్, డివిజన్, పరస్పర ఆరోపణలు, పదవుల కోసం ఆరాటం మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. ఏదేమైనప్పటికీ, దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి జాతీయ అంశాలపై ఉమ్మడి ముఖచిత్రాన్ని ప్రదర్శించేందుకు ప్రతిపక్షాలు ఈ వేదికను వాడుకోనున్నాయి.




