95 శాతం నీరే.. అయినా ఇది పోషకాల గని!

07 June 2026

TV9 Telugu

TV9 Telugu

దాదాపు 95 శాతం నీటితోనే ఉండే కీరా దోసకాయ..  శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తుంది. ఉష్ణోగ్రతనూ నియంత్రిస్తుంది

TV9 Telugu

దీన్ని పోషకాల గనిగానూ చెప్పొచ్చు. బీ, సీ విటమిన్లూ, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలూ ఇందులో అధికమే. బరువు తగ్గాలనుకునేవారు రోజూ కీరాని తినొచ్చు

TV9 Telugu

క్యాలరీలు, పిండి పదార్థాలు, చక్కెర తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. అధిక పీచుతో ఉండే కీరా దోస జీర్ణవ్యవస్థ పనితీరుకు మేలు చేస్తుంది

TV9 Telugu

ఉదర సంబంధ వ్యాధుల్నీ, మలబద్ధకాన్నీ తగ్గిస్తుంది. శరీరంలోని ఇన్సులిన్‌ స్థాయుల్ని నియంత్రిస్తూ ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడం వల్ల డీహైడ్రేట్‌ అయ్యే మధుమేహులకు దీని వల్ల ఎంతో లాభం. మెదడును ఆరోగ్యంగా ఉంచుతూ వయసుతోపాటు వచ్చే మతిమరుపు నుంచీ ఇది కాపాడుతుంది

TV9 Telugu

దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందకుండా చూడటంతోపాటు ఆ కణాల నిర్మూలనకూ కీరా ఉపయోగపడుతుంది

TV9 Telugu

సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది, పొటాషియం దీని ప్రభావాన్ని తగ్గిస్తూ రక్తపోటు పెరగకుండా చూస్తుంది

TV9 Telugu

కీరాలో సోడియం తక్కువగా ఉండటం, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రెండు రకాలుగా మేలు చేస్తుందన్నమాట. ఇంకా ఇది కొలెస్ట్రాల్‌ మోతాదులనూ తగ్గిస్తుంది