AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఒక్కటీ ఉంటే చాలంటున్న స్టార్ హీరోలు..!

ఆ ఒక్కటీ ఉంటే చాలంటున్న స్టార్ హీరోలు..!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 07, 2026 | 7:15 PM

Share

ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో హీరోలకు నటనకు పెద్దగా అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. రామ్ చరణ్ ‘పెద్ది’, అల్లు అర్జున్ ‘పుష్ప’, ఎన్టీఆర్-చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలు కమర్షియల్ విజయంతో పాటు నటనకు కూడా గుర్తింపు తెచ్చాయి. స్టార్ హీరోలు ఇప్పుడు మాస్ ఎలిమెంట్స్‌తో పాటు అవార్డు స్థాయి పర్ఫార్మెన్స్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

మామూలుగా అయితే కమర్షియల్ సినిమాల్లో హీరోలకు నటించే స్కోప్ కూడా ఉండదు.. 6 పాటలు, నాలుగు ఫైట్లు, అరడజన్ కామెడీ సీన్లు అన్నట్లుంటుంది. కానీ ఇదంతా ఒకప్పుడు.. సిచ్యువేషన్ మారిపోయిందిప్పుడు. ఫక్తు కమర్షియల్ సినిమాలోనూ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మన హీరోలు. మరి ఈ మార్పుకు కారణమేంటి..? మార్కెట్ కోసమే ఈ మార్పు వచ్చిందా..? పెద్ది చూసాక సినిమా ఎలా ఉందనేది అందరూ మరిచిపోతున్నారు.. దాని గురించి తర్వాత ముందు రామ్ చరణ్ నటన గురించి మాట్లాడుకుందాం అంటున్నారు. తన నటనతో అందరికీ కంటతడి పెట్టించేసారు చరణ్. గత పదేళ్లుగా నటుడిగా చాలా ఎదిగిపోయారు మెగా వారసుడు. రంగస్థలం, ట్రిపుల్ ఆర్.. తాజాగా పెద్దితో నటుడిగా అందనంత ఎత్తులో ఉన్నారు రామ్ చరణ్. మామూలుగా కమర్షియల్ సినిమాల్లో హీరోలకు నటించే స్కోప్ ఉండదు కానీ మన హీరోలు కథ వింటున్నపుడే యాక్టింగ్‌కు మార్క్స్ పడేలా చూసుకుంటున్నారు. అందుకే గేమ్ ఛేంజర్ ఫ్లాపైనా.. అప్పన్న పాత్రతో చరణ్ మాయ చేసారు. అలాగే పుష్పలో అల్లు అర్జున్ నటనకు ఏకంగా నేషనల్ అవార్డే వచ్చేసింది. టాలీవుడ్‌లో తొలి జాతీయ ఉత్తమ నటుడు బన్నీనే కావడం విశేషం. పుష్ప అటు కమర్షియల్‌గానే కాకుండా.. నటుడిగానూ అల్లు అర్జున్‌ను అందలమెక్కించింది. ఫక్తు కమర్షియల్ బొమ్మలో ఎమోషన్స్‌తో ఆడుకున్నారు అల్లు వారబ్బాయి. తాజాగా రాకా సినిమాలోనూ అదే రేంజ్ పర్ఫార్మెన్స్‌కు సిద్ధమవుతున్నారు బన్నీ. అట్లీ ఈ పాత్రను అలా డిజైన్ చేస్తున్నారు. ఇక ట్రిపుల్ ఆర్‌లో పోటీ పడి మరీ నటించిన తారక్, చరణ్‌ను ఎవరు మరిచిపోగలరు చెప్పండి..? వారణాసిలో మహేష్ బాబులోని నటుడికి చాలా పని చెప్పారు రాజమౌళి. ఓవైపు రుద్రగా రౌద్ర రసం పండిస్తూనే.. రాముడిగా మాయ చేయబోతున్నారు. ప్రభాస్ కూడా స్పిరిట్, ఫౌజీ లాంటి సినిమాల్లో నటుడిగా ఎమోషన్స్ టచ్ చేస్తున్నారు. మొత్తానికి ఏ స్టార్ హీరోను తీసుకున్నా కూడా కమర్షియల్‌తో పాటు అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీటి చుక్క దొరక్క ఎడారిలో 49 మంది మృతి

అండమాన్‌లో మరో భారీ గ్యాస్ నిక్షేపం.. భారత్ ఇంధన భవిష్యత్తుకు కొత్త ఆశలు

Yash: ముంబై బీచ్‌లో రూ. 24 కోట్ల ప్రాపర్టీ కొన్న యశ్!

బంగారం పెట్టుబడిదారులకు బిగ్ షాక్.. గోల్డ్ ఫండ్స్‌పై కొత్త రూల్స్..!

‘ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు’

Follow Us