సీనియర్ హీరోయిన్లకు ఆప్షన్ లేకుండా పోతోందిగా
కొత్త హీరోయిన్ల పోటీ పెరుగుతున్న నేపథ్యంలో సీనియర్ కథానాయికలు తమ కెరీర్‌కు కొత్త దిశ చూపిస్తున్నారు. తమన్నా బోల్డ్ పాత్రలు, కాజల్ సామాజిక అంశాల నేపథ్యంలో రూపొందుతున్న కథలు, కంగన నిజజీవిత ఘటనల ఆధారిత చిత్రాలు, సమంత యాక్షన్ ఫ్యామిలీ డ్రామాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రొటీన్ గ్లామర్‌కు దూరంగా భిన్నమైన కథలను ఎంచుకుంటూ తమ ప్రత్యేకతను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇండస్ట్రీ ఒకప్పట్లా లేదిప్పుడు.. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్నపుడు రేసు కూడా అలాగే ఉంటుంది. ఇలాంటి సమయంలో రొటీన్ సినిమాలు చేసి తమ ఉనికి చాటుకోవడం అంటే సీనియర్ హీరోయిన్లకు శక్తికి మించిన పనే. అందుకే వాళ్లు రూట్ మార్చేస్తున్నారు.. డిఫెరెంట్ సినిమాలు చేస్తున్నారు. మరి కొత్తగా ప్రయత్నిస్తున్న ఆ సీనియర్స్ ఎవరో చూద్దామా..? కెరీర్ మొదట్నుంచీ గ్లామర్ షో చేయడంలో తమన్నా స్టైలే వేరు. కాకపోతే ఎప్పుడూ హద్దులైతే దాటలేదు. కానీ కెరీర్ చివరికి వచ్చేసరికి ఆప్షన్ లేకుండా పోయింది. ఉనికి కోసం బోల్డ్ కథలు ఎంచుకుంటున్నారు మిల్కీ బ్యూటీ. రాగిణి ఎంఎంఎస్ 3లో చాలా బోల్డ్ క్యారెక్టర్ చేయబోతున్నారు తమన్నా. మరోవైపు కాజల్ బయట గ్లామర్ షో చేసినా.. ఇండియా స్టోరీ లాంటి డిఫెరెంట్ కథలో నటిస్తున్నారు. ఆహార కల్తీ, పురుగుల మందుల దుర్వినియోగం, దానివల్ల ప్రజారోగ్యంపై పడుతున్న తీవ్రమైన ప్రభావాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కాజల్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్నారు. చాలా బోల్డ్ కథనే ఇందులో చూపిస్తున్నారు దర్శకుడు చేట్టన్. ఇక భారత్ భాగ్య విధాతతో 26/11 దాడుల నేపథ్యంలో సినిమా చేస్తున్నారు మరో సీనియర్ హీరోయిన్ కంగన రనౌత్. 2008 ముంబై దాడుల సమయంలో కామా ఆసుపత్రిలో సుమారు 400 మందిని కాపాడిన నర్సుల యథార్థ సంఘటనల ఆధారంగా భారత్ భాగ్య విధాత వస్తుంది. మనోజ్ తపాడియా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్ 12న రిలీజ్ కానుంది. సమంత సైతం తన గ్లామర్ ఇమేజ్ పక్కనబెట్టి.. మా ఇంటి బంగారం అంటూ యాక్షన్ ఫ్యామిలీ సబ్జెక్ట్‌తో వస్తున్నారు. డిఫెరెంట్ కథలే సీనియర్ల ఉనికి కాపాడుతున్నాయిప్పుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీటి చుక్క దొరక్క ఎడారిలో 49 మంది మృతి
అండమాన్‌లో మరో భారీ గ్యాస్ నిక్షేపం.. భారత్ ఇంధన భవిష్యత్తుకు కొత్త ఆశలు
Yash: ముంబై బీచ్‌లో రూ. 24 కోట్ల ప్రాపర్టీ కొన్న యశ్!
బంగారం పెట్టుబడిదారులకు బిగ్ షాక్.. గోల్డ్ ఫండ్స్‌పై కొత్త రూల్స్..!
పరుపులతో ప్రాణాలు కాపాడిన హీరోలు!
కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్
దారుణం.. చిన్నారి కాలి ఎముకను విరగ్గొట్టిన డాక్టర్.. కారణం ఇదే
ఐఆర్సీటీసీ బిగ్ ఆపరేషన్.. 3 కోట్ల అకౌంట్లు బ్లాక్
చెట్టుపైనుంచి నోట్ల వర్షం కురిపించిన కోతి..
రోడ్డుపై కరెన్సీ విసిరేసి.. ఓ రేంజ్లో పోలీస్ దొంగా ఛేజింగ్
అత్తని బుట్టలో కూర్చోబెట్టి.. నెత్తిన పెట్టుకుని కోడలి పాదయాత్ర

