కంటి చూపుకు ప్రకృతి వరం.. పచ్చిగా తిన్నా.. ఉడికించి తిన్నా పర్లేదు!
07 June 2026
TV9 Telugu
TV9 Telugu
కంటిచూపును మెరుగుపరిచే క్యారెట్లు నారింజ రంగులో చూడముచ్చటగా ఉంటాయి కదూ! కళ్లజోడు కొనితెచ్చుకోకూడదంటే తరచూ క్యారెట్లు తింటుండాలి
TV9 Telugu
రోజూ ఒక క్యారెట్ తింటే కంటిచూపు బాగుంటుంది. కానీ ఆ మాటను పెద్దగా పట్టించుకోక కళ్లజోళ్లు కొనితెచ్చుకుంటాం. క్యారెట్ కళ్లకే కాదు మరెన్నో విధాల మేలు చేస్తుంది
TV9 Telugu
క్యారెట్‌లో ప్రొటీన్లు, పీచు, ఎ, బి1, బి6, సి, కె విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం విస్తారంగా ఉంటాయి
TV9 Telugu
ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటితో ఎముకలు, దంతాలకు పటుత్వం వస్తుంది
TV9 Telugu
తరచూ క్యారెట్లు తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. చర్మం పొడిబారదు. ముఖానికి మెరుపునిస్తాయి. జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది. సమయానికి ఆకలి వేస్తుంది
TV9 Telugu
మలబద్ధక సమస్య రాదు. వీటిలోని విటమిన్-ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఊబకాయం రాదు. బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆహారం. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇవి రక్తపోటును క్రమబద్ధం చేస్తాయి
ఫ్రైడ్‌రైస్, సాంబార్‌లకు అదనపు రుచి తెస్తాయి. సలాడ్, కేక్, కుకీస్, ఐస్‌క్రీమ్, చాక్లెట్లు, మిఠాయిల్లో క్యారెట్లను ఉపయోగిస్తారు. వీటిని ఉడికించి లేదా పచ్చివి కూడా తినొచ్చు