AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దట్ ఈజ్ మెగాస్టార్..!! రెండేళ్ల పాటు ఒకటే డ్రస్.. చిన్న కార్ షాట్‌లో 120 టెక్స్

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో హిట్ అందుకున్నారు. కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. తెలుగు సినిమాల్లో చిరంజీవికి ఒక సపరేట్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

దట్ ఈజ్ మెగాస్టార్..!! రెండేళ్ల పాటు ఒకటే డ్రస్.. చిన్న కార్ షాట్‌లో 120 టెక్స్
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Apr 30, 2026 | 1:26 PM

Share

కోడి రామకృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక గొప్ప నిర్మాణ సాహసంగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు తన జీవితంలో ఒక “పెద్ద మాన్యుమెంట్”గా అభివర్ణించారు. దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఈ చిత్రం నిర్మాణం కొనసాగింది, ఇది గ్రాఫిక్స్, సాంకేతిక సవాళ్లకు నిదర్శనం. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అమ్మోరు తర్వాత చిరంజీవి గారితో ఒక గ్రాఫిక్స్ నేపథ్యంలో చిత్రం చేయాలనే తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. కమర్షియల్ సినిమా వైపు మొగ్గు చూపమన్న సూచనలను పక్కన పెట్టి, ఆయన చిరంజీవిని గ్రాఫిక్స్ చిత్రానికి ఒప్పించారు. చిరంజీవి కూడా ఒక కొత్త నటుడిలా పూర్తి సహకారం అందించారని కోడి రామకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చిరంజీవి సినిమా కోసం ఎంత కష్టమైనా ఎన్ని రోజులైనా పని చేయడానికి సిద్ధపడ్డారు. ఉదాహరణకు, ఒక నెల రోజుల పాటు ఇంటర్వెల్ సన్నివేశం తీశాం.. చిరంజీవి ఎంతో ఓపికగా చేశారు.

ఇది కూడా చదవండి : Folk Song: ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు ఆ పాట వచ్చింది.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్

క్లైమాక్స్ డ్రెస్సును దాదాపు రెండేళ్ల పాటు అదే విధంగా ఉంచడం, గ్రాఫిక్స్ మార్కులు చెరిగిపోకుండా చూసుకోవడం వంటి చాలా కష్టం అయ్యాయి. అంజి కేవలం గ్రాఫిక్స్ చిత్రం మాత్రమే కాదు, కథా పరంగా కూడా చాలా సంక్లిష్టమైనది. చిరంజీవిని “ఒరేయ్” అని సంబోధించే ఒక పాత్ర కోసం, నాగబాబు గారిని ఎంపిక చేయడం జరిగింది. ఆ పాత్రకు మీసాలు, గెటప్‌లతో కూడిన డిఫరెంట్ లుక్ సృష్టించారు. ఒక చిన్న కార్ షాట్‌లో 120 టెక్స్ ఉండటం వంటి ఉదాహరణలు, గ్రాఫిక్స్ పని ఎంత క్లిష్టంగా ఉందో తెలియజేస్తాయి. సింగపూర్, ఒరిస్సా, మలేషియా, అమెరికా వంటి వివిధ ప్రదేశాల నుండి కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు చేశారు,

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..

ఐదు సంవత్సరాల సుదీర్ఘ నిర్మాణ కాలంలో, చిత్ర యూనిట్ రిస్క్‌లను కూడా ఎదుర్కొంది. హీరో, హీరోయిన్ మినహా మిగిలిన నటీనటులు చాలా మంది కొత్తవారే. ఒకవేళ ఎవరైనా మధ్యలో వెళ్లిపోయినా, వారి స్థానంలో అదే విధమైన మరొకరిని గుర్తించడం వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒక మాంత్రికుడి పాత్ర కోసం ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి వద్ద ఉన్న ఒక బెగ్గర్‌ను ఎంపిక చేయడం వంటి ఆసక్తికరమైన నిర్ణయాలు ఈ చిత్ర నిర్మాణంలో భాగం. మహేష్ బాబు సతీమణిని (నమ్రత శిరోద్కర్) మొదటిసారిగా పరిచయం చేయడం. విడుదలైన సమయంలో అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలు రాకపోయినా, అంజి చిత్రం కాలక్రమేణా మంచి ఆదరణ పొందింది. ఈరోజు టీవీలో లేదా ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో చూసిన ప్రేక్షకులు, ఇది ఏ హాలీవుడ్ చిత్రానికి తీసిపోదని ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా
ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా
పాతకాలం నాటి చిట్కా.. ఇలా చేస్తే చికెన్‌ కర్రీ నీచు వాసన రాదు..
పాతకాలం నాటి చిట్కా.. ఇలా చేస్తే చికెన్‌ కర్రీ నీచు వాసన రాదు..
ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన..
ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన..
చీర కోసం కబోర్డ్ తెరిచిన మహిళ.. లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్!
చీర కోసం కబోర్డ్ తెరిచిన మహిళ.. లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్!
'మీ విలువను గుర్తించని చోట ఉండకండి..' మీ ఆలోచన మార్చే కథ
'మీ విలువను గుర్తించని చోట ఉండకండి..' మీ ఆలోచన మార్చే కథ
‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’! బస్సులోనే అంతరిక్షం.. విద్యార్థుల వద్దకే
‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’! బస్సులోనే అంతరిక్షం.. విద్యార్థుల వద్దకే
కమ్మ కమ్మని అరటికాయ వేపుడు.. ఇంట్లో ఎలా చేయాలంటే?
కమ్మ కమ్మని అరటికాయ వేపుడు.. ఇంట్లో ఎలా చేయాలంటే?
లెజెండరీ దర్శకుడి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం..
లెజెండరీ దర్శకుడి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం..
రో - కో ఫ్యూచర్‌పై గిల్ సంచలన కామెంట్స్.. ఇచ్చిపడేశాడ్రోయ్..!
రో - కో ఫ్యూచర్‌పై గిల్ సంచలన కామెంట్స్.. ఇచ్చిపడేశాడ్రోయ్..!
వారే ఆ చెడ్డ వీడియోను వైరల్ చేశారు.. ‘చుట్టమల్లె మార్ఫింగ్ పై RGV
వారే ఆ చెడ్డ వీడియోను వైరల్ చేశారు.. ‘చుట్టమల్లె మార్ఫింగ్ పై RGV