AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి

సినిమా ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్ , ప్రేమలు, పెళ్లి , విడాకులు అనేవి చాలా కామన్. చాలా మంది నటీనటులు సోషల్ మీడియాలో సడన్ గా విడాకులు అనౌన్స్ చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. అలాగే ఓ సీరియల్ నటి తన భర్త గురించి షాకింగ్ విషయాలను బయట పెట్టింది.

నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 28, 2026 | 8:28 AM

Share

సీరియల్స్ ద్వారా చాలా మంది నటీనటులు పాపులర్ అయ్యారు. వారిలో పూజిత ఒకరు. సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటించి మెప్పించారు పూజిత. పూజిత తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఆమె వివాహ బంధం ఎదుర్కొన్న తీవ్రమైన సవాళ్ల గురించి ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టారు. డాక్టర్‌గా అవ్వాల్సిన తాను, తండ్రి డా. రాధాకృష్ణకు ఇచ్చిన మాట కోసం చిత్ర పరిశ్రమలోకి వచ్చానని, వివాహం తర్వాత కూడా పరువుకు భంగం కలిగించే పనులు చేయకూడదన్న ఆయన మాటను నిలబెట్టుకోవడం కోసమే 18 సంవత్సరాలు భర్త విజయ గోపాల్‌తో కష్టాలతో కూడిన జీవితాన్ని గడిపానని తెలిపారు. పెళ్లయిన మూడు రోజులకే విజయ గోపాల్ ప్రవర్తన తెలిసినా, తాను మాట తప్పకూడదన్న నియమాన్ని పాటించానని పూజిత చెప్పుకొచ్చారు. తన భర్త వ్యసనాలకు బానిసై, ఫిలింనగర్‌లో అచ్యుత్ రెడ్డి స్టూడియోను తన డబ్బుతో లీజ్‌కు తీసుకుని, అక్కడ మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి :  Sudha: నా కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు.. ఇప్పుడు ఇంత పెద్ద హీరో అయ్యాడు..

షూటింగ్స్‌కు వెళ్ళినప్పుడు తనను ఇంట్లో తాళం వేసి, ఇతర మహిళలతో ఛాటింగ్ చేసేవారని, ఒకసారి పవని అనే పేరుతో వచ్చిన మెసేజ్‌లతో భర్త అక్రమ సంబంధం గురించి తెలిసిందని పూజిత చెప్పారు. ఈ సంఘటన తర్వాత కూడా ఆమె మౌనంగానే ఉన్నారని, వారిద్దరి మధ్య మాటలు లేవని తెలిపారు. విజయ గోపాల్ తన నగలు, డబ్బు దాదాపు రెండున్నర కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని, నగదును దొంగిలించి, ఇంటి నుంచి పారిపోయారని పూజిత తెలిపారు. అంతకు ముందు కూడా  తన కుమారుడి గొంతు నొక్కి డబ్బులు తీసుకెళ్లేవారని, ఒక్కరోజు కూడా తన బిడ్డను ఎత్తుకోలేదని కన్నీరు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు ఈవెంట్‌లో పన్నీరు చల్లింది.. ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఈ అమ్మడికి క్రేజ్ మాములుగా లేదు

విజయ గోపాల్ తనను విడిచి వెళ్ళిన తర్వాత, మొత్తం ఎనిమిది మంది మహిళలను మోసం చేసి, వివాహం చేసుకున్నారని పూజిత వెల్లడించారు. తొమ్మిదవ వ్యక్తి ఐఏఎస్ అధికారి, ఆమె కుటుంబాన్ని మోసం చేసి విజయ గోపాల్ పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి, తనను ఆ పెళ్లిని ఆపమని కోరగా, తాను షీ టీమ్స్‌ను ఆశ్రయించి పెళ్లిని నిలిపివేయించానని పూజిత తెలిపింది. అయితే, ఆ తర్వాత మూడు రోజులకు ఓ ఐపీఎస్ అధికారి ఇంట్లో వారికి పెళ్లి జరిగిందని, ఆ ఐఏఎస్ కు 28-29 ఏళ్ళ కొడుకు ఉన్నా కూడా ఆమెకు అంతా తెలిసే ఈ పెళ్లి చేసుకున్నారని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విజయ గోపాల్ కొందరు ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులకు “బినామీ” అని, అందుకే వారు అతన్ని ఎన్ని కేసులు పెట్టినా కాపాడుతున్నారని పూజిత ఆరోపించారు.

ఇది కూడా చదవండి : తెలుగులో అతనంటే పిచ్చి.. నా ఫేవరెట్ హీరో ఆయనే.. మనసులో మాట చెప్పిన కృతిశెట్టి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీలో 19కి చేరిన కోవిడ్ కేసుల సంఖ్య.. ఆ జిల్లాలోనే 8 మందికి..
ఏపీలో 19కి చేరిన కోవిడ్ కేసుల సంఖ్య.. ఆ జిల్లాలోనే 8 మందికి..
డిగ్రీ అర్హతతో 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్ ఉద్యోగాలు.. లింక్ ఇదిగో
డిగ్రీ అర్హతతో 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్ ఉద్యోగాలు.. లింక్ ఇదిగో
ఈ బ్యాంక్‌లో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా?
ఈ బ్యాంక్‌లో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా?
ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్.. వారందరికీ విమానంలో ఉచిత ప్రయాణం!
ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్.. వారందరికీ విమానంలో ఉచిత ప్రయాణం!
నిమ్మ చెట్టుకు కాయలు కాయడం లేదా? అయితే ఈ పొరపాట్లు చేస్తున్నట్లే!
నిమ్మ చెట్టుకు కాయలు కాయడం లేదా? అయితే ఈ పొరపాట్లు చేస్తున్నట్లే!
భారత్ కొంపముంచుతోన్న గిల్, గంభీర్ మొండి పట్టుదల
భారత్ కొంపముంచుతోన్న గిల్, గంభీర్ మొండి పట్టుదల
బ్యాంక్ అకౌంట్‌కు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదా..? జాగ్రత్త
బ్యాంక్ అకౌంట్‌కు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదా..? జాగ్రత్త
ప్రకృతి ఒడిలో వింత జీవులు.. ఆకట్టుకుంటున్న ‘నేత చీమలు..
ప్రకృతి ఒడిలో వింత జీవులు.. ఆకట్టుకుంటున్న ‘నేత చీమలు..
'నా జీతం సగం తగ్గించండి.. లేదంటే బదిలీ చేయండి' ఓ IAS అధికారి లేఖ
'నా జీతం సగం తగ్గించండి.. లేదంటే బదిలీ చేయండి' ఓ IAS అధికారి లేఖ
అందరి కోసం పోరాడితే నన్ను జైల్లో వేశారు..
అందరి కోసం పోరాడితే నన్ను జైల్లో వేశారు..